Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

నిరంతరం నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా సేవలు అందిస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్

15-01-2026 133 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:సమాజంలో వెనుకబడిన వర్గాలకు అండగా నిలుస్తూ, నిరుపేద కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో జీఎంఆర్ ఫౌండేషన్ నిత్యం సేవా కార్యక్రమాలు చేపడుతోంది. అవసరంలో ఉన్నవారిని గుర్తించి వారికి సహాయం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.సిర్గాపూర్ మండలం వంగ్ధల్ గ్రామానికి చెందిన శాంతమ్మ సర్వమణి కుటుంబం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం జీఎంఆర్ ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు గుఱ్ఱపు మచ్చేందర్ దృష్టికి రావడంతో వెంటనే స్పందించారు. మానవతా దృక్పథంతో ఆ కుటుంబానికి నెలకు సరిపడా నిత్యావసర సరుకులను అందజేశారు.అలాగే భవిష్యత్తులో కూడా అవసరం వచ్చినప్పుడు జీఎంఆర్ ఫౌండేషన్ ఎల్లవేళలా ఆ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. నిరుపేదల సంక్షేమమే తమ ప్రధాన లక్ష్యమని, ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత విస్తృతంగా కొనసాగిస్తామని జీఎంఆర్ ఫౌండేషన్ పేర్కొంది.ఈ కార్యక్రమంలో కన్న పటేల్, నారాయణఖేడ్ మున్సిపల్ 8వ వార్డు బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తుకారాం, జీఎంఆర్ ఫౌండేషన్ ప్రతినిధులు శ్రీనివాస్, పండరినాథ్, నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిరంతరం నిరుపేదల సంక్షేమమే లక్ష్యంగా సేవలు అందిస్తున్న జీఎంఆర్ ఫౌండేషన్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News