Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:40 AM

నిరంతర ఉద్యమాలతో ఆసుపత్రి అభివృద్ధి కోసం సీపీఎం పోరాటం. నీల అయిలయ్య

17-03-2026 77 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

100 పడకల ఆసుపత్రి కోసం నిరవధిక నిరాహార దీక్ష

(సీపీఎం) ఆధ్వర్యంలో ప్రజలకు సరైన వైద్యం అందించాలనే లక్ష్యంతో నిరంతరం ఉద్యమాలు, దశలవారీ పోరాటాలు కొనసాగుతున్నాయని సిపిఎం నాయకులు నీలం ఐలయ్య అన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రోగులకు నాణ్యమైన వైద్యం అందకపోతే వారి పక్షాన నిలబడి సీపీఎం అనేక దఫాలు ఆందోళనలు చేపట్టింది.

దవాఖానలో మౌలిక సదుపాయాల కల్పన కోసం సంతకాల సేకరణ, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తూ సమస్య తీవ్రతను అధికారుల దృష్టికి తీసుకెళ్లింది. మండలానికి వచ్చిన కలెక్టర్, వైద్య అధికారులు, ప్రజాప్రతినిధులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించింది.

రామన్నపేట ఏరియా ఆసుపత్రిని 30 పడకల నుండి 100 పడకల ఆసుపత్రిగా మార్చాలని సీపీఎం ఎన్నాళ్లుగానో డిమాండ్ చేస్తోంది. అయినప్పటికీ పాలకులు స్పందించకపోవడంతో ఆసుపత్రి అభివృద్ధి కోసం సీపీఎం నాయకత్వం మరింత ఉధృతంగా పోరాటాన్ని కొనసాగిస్తోంది.

ఈ క్రమంలో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన రూ.40 కోట్లు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 8 మంది సీపీఎం నాయకులు నిరవధిక నిరాహార దీక్షకు దిగారు. ఈ దీక్షలతో ప్రభుత్వం వెంటనే స్పందించి నిధులు మంజూరు చేయాలని వారు కోరుతున్నారు.

ప్రజా వైద్య సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న ఈ పోరాటానికి మండలంలోని అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని, రాజకీయ పక్షాలు కూడా స్పందించాలని సీపీఎం నాయకులు పిలుపునిచ్చారు. ప్రజల ఆరోగ్యం కోసం తమ ఆరోగ్యాలను పణంగా పెట్టి పోరాడుతున్న ఈ ఉద్యమం విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

Sthanikam

నిరంతర ఉద్యమాలతో ఆసుపత్రి అభివృద్ధి కోసం సీపీఎం పోరాటం. నీల అయిలయ్య

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News