Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:35 AM

నిరవధిక నిరాహార దీక్షలకు పెరుగుతున్న ప్రజాదరణ.

17-03-2026 42 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ ఇచ్చేదాకా నిరవధిక దీక్షలు విరమించేది లేదని ప్రాణాలు పోయినా దీక్ష కొనసాగిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జిల్లాల పెంటయ్య తెలిపారు.ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సిపిఎం రామన్నపేట మండల కమిటీ ఆధ్వర్యంలోని చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షలు రెండో రోజుకు చేరిన సందర్భంలో మండలంలోని వివిధ రంగాల సంస్థలు, ప్రజల నుండి ప్రజాదరణ పెరుగుతుందని అన్నారు. దీక్షలు రెండో రోజుకు చేరిన సందర్భంగా వివేకానంద డివైన్ మోడల్ స్కూల్, డాన్ బాస్కో స్కూల్ యాజమాన్యం విద్యార్థిని విద్యార్థులు, మండల పాత్రికేయులు,మండల మెడికల్ షాప్స్(కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్) మండల అసోసియేషన్ సభ్యులు, మండల ఎమ్మార్పీఎస్ నాయకులు, లాయర్స్ యూనియన్ అసోసియేషన్ నాయకులు, డివైఎఫ్ఐ, ఎస్ఎఫ్ఐ,పూల బండ్ల షాప్ల మహిళలు స్వచ్ఛందంగా నిరవధిక నిరాహార దీక్షలో శిబిరానికి విచ్చేసి సంఘీభావం తెలిపి మద్దతు ప్రకటించడం జరిగిందని తెలిపారు. ఒకవైపు నాయకుల ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ ప్రభుత్వం నుండి అధికారుల నుండి ఎలాంటి స్పందన రాకపోవడం ప్రజాపాలనలో ప్రజల కోసం పోరాటానికి మద్దతు తెలపకపోవడం విచారకరమని అన్నారు. వంద పడకల ఆస్పత్రి కొరకు ప్రజాప్రతినిధులు అధికారులు స్పష్టమైన హామీ ఇవ్వాలని లేని పక్షంలో రామన్నపేట మండల బందుకు పిలుపునిచ్చి వివిధ రంగాల ప్రజలను, మేధావులను,వివిధ రాజకీయ పార్టీలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు

ఈ కార్యక్రమంలో దీక్ష సభ్యులు సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, మండల కార్యదర్శి వర్గ సభ్యులు కూరెళ్ళ నరసింహ చారి, కందుల హనుమంతు, మండల కమిటీ సభ్యులు మాజీ వైస్ ఎంపీపీ నాగటి ఉపేందర్, గొరిగె సోములు,వేముల సైదులు,శానగొండ రాము ఉన్నారు. మద్దతు తెలిపిన వారిలో వివేకానంద డివైన్ మోడల్ స్కూల్ కరస్పాండెంట్ తిరగడం మల్లికార్జున్,స్కూల్ యాజమాన్యం పిట్టల మత్స్యగిరి, మండల మెడికల్ షాప్స్ యజమాన్యం రాపోలు రమేష్,నరసింహ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఈర్లపల్లి మల్లయ్య మండల అధ్యక్షులు నోముల చిరంజీవి, లాయర్స్ యూనియన్ అసోసియేషన్ సభ్యులు మామిడి వెంకటరెడ్డి, పాల్వంచ జగతయ్య,పూల బండ్ల షాప్ మహిళలు శంకరమ్మ, లక్ష్మమ్మ తదితరులు స్వచ్ఛందంగా పాల్గొని దీక్షలకు మద్దతు తెలిపారు

Sthanikam

నిరవధిక నిరాహార దీక్షలకు పెరుగుతున్న ప్రజాదరణ.

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News