Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:24 PM

నిజాయితీకి నిలువునా అన్యాయం

నిజాయితీకి నిలువునా అన్యాయం

నిజాయితీకి నిలువునా అన్యాయం
08-02-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Kodada Reporter
Harish reporter

కర్రీ శివ సుబ్బారావు దంపతుల కన్నీటి పర్యంతం

స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించుకుంటామన్న వార్డు ప్రజలు

కాంగ్రెస్ పార్టీ కోసం రాత్రింబవళ్లు కష్టపడితే, కనీస గుర్తింపు లేకుండా వేరే పార్టీ నుంచి వచ్చిన వ్యక్తికి టికెట్ ఇచ్చి తమను అవమానించారని 18వ వార్డు మాజీ కౌన్సిలర్ కర్రీ శివ సుబ్బారావు దంపతులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆదివారం సిపిఐ సీనియర్ నాయకులు బద్దం భద్రారెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్లు బీఆర్‌ఎస్ అరాచక పాలనలో అనేక ప్రలోభాలకు గురిచేసినా, ఎన్ని అవమానాలు ఎదురైనా కాంగ్రెస్ జెండాను వీడకుండా నిలబడిన తమకు, నేడు పార్టీ పెద్దలు వెన్నుపోటు పొడిచారని అన్నారు. ఏ సంబంధం లేని వ్యక్తికి గంటల వ్యవధిలో టికెట్ ఇచ్చి తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీశారని వాపోయారు. అయితే, వార్డు ప్రజలు మాత్రం మేమున్నాం అంటూ భరోసా ఇచ్చారు. నిస్వార్థంగా సేవ చేసిన శివ సుబ్బారావును స్వతంత్ర అభ్యర్థిగా గెలిపించుకుంటామని ఏకగ్రీవంగా తీర్మానించి మానవత్వాన్ని చాటుకున్నారు.కార్యకర్తల మనోభావాలను గౌరవించని పాలకులకు ఓటుతో బుద్ధి చెబుతామని, శివ సుబ్బారావును భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని వారు ప్రతిజ్ఞ చేశారు. కన్నీటి పర్యాంతం అవుతున్న శివ సుబ్బారావు దంపతులను వార్డు ప్రజలు ఓదార్చారు. ఈ సమావేశంలో సిపిఐ సీనియర్ నాయకులు బద్దం భద్రారెడ్డి, గరినే కోటేశ్వరరావు, దానాల వెంకయ్య, కంబాల రంగ, శ్రీనివాస్ రెడ్డి, శివారెడ్డి, అఖిలేష్ రెడ్డి, బండారు భాస్కర్, శివ తదితరులు పాల్గొన్నారు.....

Sthanikam

నిజాయితీకి నిలువునా అన్యాయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News