Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 02:03 AM

నిఘా నేత్రాలతో నేరాలకు అడ్డుకట్ట.. కమాండ్ కంట్రోల్ కేంద్రం ప్రారంభం

13-04-2026 99 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

- సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు, వ్యాపారులు ముందుకు రావాలి.

- ప్రజల రక్షణలో పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తుంది.

- నేరాల నివారణలో ప్రజలు భాగస్వామి కావాలి.

పట్టణంలో నేరాల నియంత్రణకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ సూర్యాపేట పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ నర్సింహా ప్రారంభించారు. మొత్తం 75 సీసీ కెమెరాలను అనుసంధానం చేసి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ నేరాల నివారణ, నియంత్రణ, చేదనలో సీసీ కెమెరాల ప్రాధాన్యత ఎంతో కీలకమని తెలిపారు. ప్రతి కెమెరా వందమంది పోలీసులకు సమానంగా పనిచేస్తుందని పేర్కొన్నారు. ప్రజల భద్రత కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని చెప్పారు.

పట్టణంలో భద్రతను మరింత బలోపేతం చేయడానికి సీసీ కెమెరాల సంఖ్యను పెంచుతున్నామని, ప్రజలు, వ్యాపారులు ముందుకు వచ్చి తమ ప్రాంతాల్లో కెమెరాలు ఏర్పాటు చేయాలని కోరారు. నేరాల నివారణలో ప్రజలు కూడా భాగస్వాములు కావాల్సిన అవసరం ఉందని సూచించారు.పట్టణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను నిత్యం పర్యవేక్షణ చేయడానికి పోలీస్ స్టేషన్‌కు అనుసంధానం చేసి ఈ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆధునిక పద్ధతులతో నేరాలను అరికట్టే దిశగా చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొరిశెట్టి నివేదిత లక్షాది, వైస్ చైర్మన్ షఫీ ఉల్లా, డిఎస్పి ప్రసన్నకుమార్, ఆర్టీవో జయప్రకాశ్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ హనుమంతరెడ్డి, పట్టణ ఇన్స్పెక్టర్ వెంకటయ్య, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నిఘా నేత్రాలతో నేరాలకు అడ్డుకట్ట.. కమాండ్ కంట్రోల్ కేంద్రం ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News