Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:36 AM

నిదానపల్లిలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

27-03-2026 271 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భక్తుల కోలాహలం మధ్య దివ్య కల్యాణం

ఊరేగింపుగా స్వామివారికి ఘన స్వాగతం, ప్రత్యేక పూజలు, అన్నదానం

శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గ్రామంలో ఐదోసారి శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయాన్ని పూలతో, విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించి భక్తులకు దర్శనమిచ్చేలా తీర్చిదిద్దారు. ఉదయం నుంచే భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా స్వామివారిని గ్రామపంచాయతీ నుండి హనుమాన్ ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకువచ్చి మహిళలు హారతులతో ఘన స్వాగతం పలికారు. పల్లకికి బిందెలతో నీళ్లు పోస్తూ భక్తి శ్రద్ధలతో ఆహ్వానించారు. ఆలయ ప్రాంగణం మొత్తం భక్తులతో కళకళలాడింది.

చైత్రమాస శుద్ధ నవమి సందర్భంగా ఉదయం 11:55 గంటలకు అభిజిత్ లగ్నంలో వేద పండితుల మంత్రోచ్ఛారణల నడుమ సీతారాముల కళ్యాణం శాస్త్రోక్తంగా ఘనంగా నిర్వహించారు. తలంబ్రాలు, మంగళసూత్రధారణ వంటి కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా నిర్వహించగా భక్తులు హర్షధ్వానాలు వ్యక్తం చేశారు.

సర్పంచ్ నారపాక మాధవి–యాదయ్య, కొండ అశోక్ గౌడ్–అనూష, చల్ల శ్రీశైలం–మమత, నాగభూషణం–పద్మ, బబ్బూరి నర్సయ్య -నాగమణి, కొండ శంకరయ్య- పుష్పమ్మ, కడారి భాగ్య- రవి,దంపతులు కళ్యాణం కళ్యాణం మీద కూర్చున్నారు. యూత్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకలు భక్తి వాతావరణంలో కొనసాగాయి.

అలాగే ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి భక్తులకు ప్రసాదం అందజేశారు. గ్రామంలోని భక్తులు, యువకులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. మొత్తం కార్యక్రమం భక్తి పరవశంలో సాగి గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పింది. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు మహిళలు పాల్గొన్నారు.

Sthanikam

నిదానపల్లిలో అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News