Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:49 PM

నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉద్యమానికి బలమైన తోడ్పాటు – రాష్ట్ర కమిటీలో మోహన్‌కు స్థానం

24-02-2026 269 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో నిర్వహించిన ముఖ్య సమావేశంలో రాష్ట్ర కమిటీ మెంబర్‌గా ధనావత్ మోహన్‌కు నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జాతీయ అధ్యక్షుడు డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ చేతుల మీదుగా నియామక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.నల్లగొండ జిల్లా, మిర్యాలగూడ మండలానికి చెందిన ధనావత్ మోహన్ ను రాష్ట్ర కమిటీ సభ్యుడిగా నియమిస్తూ పత్రికా ప్రకటన విడుదల చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ మంగళపెల్లి హుస్సేన్ మాట్లాడుతూ,సమాజంలో మానవ హక్కుల పరిరక్షణ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్యార్థులు మరియు సాధారణ ప్రజలకు వారి హక్కులపై అవగాహన కల్పించడం సంస్థ యొక్క ప్రధాన లక్ష్యమని తెలిపారు. మానవ హక్కుల ఉల్లంఘనలు ఎక్కడైనా జరిగితే వాటిని గుర్తించి తక్షణ చర్యలు తీసుకునే దిశగా రాష్ట్ర కమిటీ సభ్యులు చురుకుగా పని చేయాలని సూచించారు.తనకు ఈ బాధ్యత అప్పగించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మోహన్ మాట్లాడుతూ, సంస్థ ఆశయాలకు అనుగుణంగా ప్రజలకు సేవ చేయడం తన కర్తవ్యంగా భావిస్తున్నానని అన్నారు. మానవ హక్కుల పరిరక్షణ, సామాజిక న్యాయం మరియు సమానత్వం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు వినోద్ కుమార్తో పాటు ఇతర సభ్యులు పాల్గొన్నారు. సమావేశం సౌహార్ద వాతావరణంలో జరిగి, సంస్థ భవిష్యత్ కార్యాచరణపై చర్చలు జరిపారు.

Sthanikam

నేషనల్ హ్యూమన్ రైట్స్ ఉద్యమానికి బలమైన తోడ్పాటు – రాష్ట్ర కమిటీలో మోహన్‌కు స్థానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News