Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

నీరోలా నిర్లక్ష్యం వద్దు..! ప్రజల ప్రాణాలపై పాలకుల బాధ్యత ఎక్కడ? డి. హరినాథ్

26-02-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

రోమ్ నగరం అగ్నికి ఆహుతవుతుంటే నీరో చక్రవర్తి వీణ వాయించాడన్న చరిత్రను ఉదాహరణగా చూపుతూ, రాష్ట్రంలో జరుగుతున్న ఘటనలపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు–లెనినిస్టు) లిబరేషన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ డిమాండ్ చేశారు.

శ్రీకాకుళం జిల్లాలో అతిసారాతో, రాజమహేంద్రవరం నగరంలో నకిలీ పాలు కారణంగా మరణాలు సంభవిస్తుంటే బాధిత కుటుంబాలను పరామర్శించి, వైద్య సహాయం, ఆర్థిక సాయం అందించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం ప్రజా సమస్యలను పక్కనబెట్టి ఇతర కార్యక్రమాల్లో నిమగ్నమవడం సరికాదని విమర్శించారు. ప్రజల ఆరోగ్యం, ప్రాణ భద్రతలకు ప్రాధాన్యం ఇవ్వడం పాలకుల ప్రాథమిక బాధ్యత అని స్పష్టం చేశారు.

ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా పాలకవర్గం ప్రజా సమస్యలపై స్పష్టమైన చర్యలు ప్రకటించాలని డి. హరినాథ్ కోరారు.

“తాగే నీటిలో కల్తీ, పాలలో కల్తీ… రాష్ట్రవ్యాప్తంగా నిర్లక్ష్యం పెరిగితే మరిన్ని ప్రాణనష్టాలు సంభవించే ప్రమాదం ఉంది. వెంటనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి” అని ఆయన హెచ్చరించారు.

ప్రజా సమస్యలపై రాజకీయాలకు అతీతంగా స్పందించి, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు–లెనినిస్టు) లిబరేషన్ ప్రభుత్వం వద్ద డిమాండ్ చేసింది.

Sthanikam

నీరోలా నిర్లక్ష్యం వద్దు..! ప్రజల ప్రాణాలపై పాలకుల బాధ్యత ఎక్కడ? డి. హరినాథ్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News