Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
శివనేనిగూడెంలో ఘనంగా గణపతి నవరాత్రి ఉత్సవాలు అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 04:05 AM

నేరేడుచర్లలో నూతన మున్సిపల్ నేతలకు ఘన సన్మానం

23-02-2026 355 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పట్టణ సమగ్ర అభివృద్ధికి సహకారం అందిస్తామని హామీ

నేరేడుచర్ల పట్టణంలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ కొనతం చిన్న వెంక రెడ్డి, ఉపాధ్యక్షుడు నూకల సందీప్ రెడ్డిని యుపిఎ సహాయ వేతన దైవ సేవకులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు. పట్టణ అభివృద్ధి దిశగా వారు చేపట్టబోయే కార్యక్రమాలకు సంపూర్ణ మద్దతు తెలుపుతూ ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ ప్రజలు ఆశించిన విధంగా పారదర్శక పరిపాలన అందించాలని కోరారు. పట్టణంలో మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుద్ధ్యం, తాగునీరు, రహదారుల మెరుగుదల వంటి అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అన్ని వర్గాల ప్రజలను సమానంగా చూడాలని, మత సామరస్యాన్ని కాపాడుతూ ముందుకు సాగాలని సూచించారు. సన్మానానికి స్పందించిన మున్సిపల్ చైర్మన్ కొనతం చిన్న వెంక రెడ్డి మాట్లాడుతూ నేరేడుచర్లను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. పట్టణంలోని ప్రతి వర్గం ప్రజలకు అందుబాటులో ఉంటామని, క్రైస్తవులకు అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. ఉపాధ్యక్షుడు నూకల సందీప్ రెడ్డి మాట్లాడుతూ పట్టణాభివృద్ధి కోసం అందరి సహకారం అవసరమని పేర్కొన్నారు. ప్రజల సమస్యలను ప్రాధాన్యంగా తీసుకుని పరిష్కరించేందుకు కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షుడు రెడపంగ దానియేలు, కార్యదర్శి పాల్ రాజు, ఖజానాదారు యెషూరూను, గౌరవ సలహాదారు సుధాకర్ రావు, ఫిలిప్పు, శ్యామ్, గోవిందు, సాల్మన్, అబ్రహం, పేతురు, ధర్మయ్య తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమం సౌహార్ద వాతావరణంలో సాగింది.

Sthanikam

నేరేడుచర్లలో నూతన మున్సిపల్ నేతలకు ఘన సన్మానం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News