Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:38 AM

నేరేడ్మెట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ, 18 నెలల వయసు గల చిన్నారి అదృశ్యం

01-02-2026 69 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Medchal Malkajgiri incharge
Prabhakar

నాలుగు నెలల గర్భవతి అయిన కుమార్తె కోసం తల్లిదండ్రుల ఆవేదన

నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళతో పాటు 19 నెలల వయసుగల చిన్నారి అదృశ్యమైన ఘటన కలకలం రేపుతోంది.

ఈ ఘటనకు సంబంధించి ఆమె తల్లి పోలీసులకుఫిర్యాదుచేసింది.వివరాల్లోకి వెళ్తేనేరేడ్మెట్ వివేకానందపురానికి చెందిన పావళూరు రేణుక (47) తన కుమార్తె పావళూరు ఆర్తి (21) మరియు మనవరాలు చైత్రిక (19 నెలలు) కనిపించడం లేదంటూ నేరేడ్మెట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆర్తి సాయినాథపురం లో నివాసం ఉంటోంది.

ఆర్తి ప్రకాశ్ అనే యువకుడి తో ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి చైత్రిక అనే 19 నెలల ఆడబిడ్డ ఉంది. ప్రస్తుతం ఆర్తి నాలుగు నెలల గర్భవతి కావడం గమనార్హం.జనవరి 31వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో భర్తతో గొడవ జరిగిన అనంతరం ఆర్తి తల్లికి ఫోన్ చేసి సమాచారం ఇచ్చింది. ఆ సమయంలో తల్లి రేణుక ఇంట్లో లేకపోవడంతో తాను తిరిగి భర్త ఇంటికి వెళ్లిపోతానని ఆర్తి చెప్పినట్లు ఫిర్యాదులో ఆమె తల్లి పేర్కొన్నారు.

అయితే, ఆ తర్వాత ఆర్తి భర్త ఇంటికి తిరిగి చేరుకోలేదని, ఆమెతో పాటు చిన్నారి చైత్రిక కూడా కనిపించడంలేదని కుటుంబ సభ్యులు గుర్తించారు. బంధువులు, స్నేహితులు, తెలిసిన అన్ని చోట్లా వెతికినప్పటికీ ఎలాంటి సమాచారం లభించకపోవడంతో చివరకు నేరేడ్మెట్ పోలీసులను ఆశ్రయించారు.బాధితుల ఫిర్యాదు మేరకు నేరేడ్మెట్ పోలీసులు మహిళ మరియు బాలిక మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కాల్ డీటెయిల్స్, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం.నాలుగు నెలల గర్భవతి అయిన కుమార్తెతో పాటు చిన్నారి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

Sthanikam

నేరేడ్మెట్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో మహిళ, 18 నెలల వయసు గల చిన్నారి అదృశ్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News