Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 06:38 AM

నీర్నెంలలో ఘనంగా చరణ్య శ్రీ ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ

27-03-2026 78 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

సమాజ సేవే ధ్యేయం – వ్యవస్థాపకుడు గోపి దోమలపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం లోని నీర్నెంల గ్రామ పంచాయతీ కార్యాలయంలో చరణ్య శ్రీ ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గ్రామ ప్రముఖులు, ఫౌండేషన్ సభ్యుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం ఆకట్టుకుంది.

ఈ సందర్భంగా ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు గోపి దోమలపల్లి మాట్లాడుతూ… సమాజంలోని అణగారిన వర్గాలకు అండగా నిలవడం, గ్రామీణ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడమే తమ లక్ష్యమని తెలిపారు. యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వాములను చేస్తూ బాధ్యతాయుత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని పేర్కొన్నారు.

గ్రామీణాభివృద్ధి, పేద విద్యార్థులకు విద్యా సహాయం, పర్యావరణ పరిరక్షణ, సమాజంలో అక్రమాలపై పోరాటం వంటి అంశాలను ఫౌండేషన్ ముఖ్యంగా చేపడుతుందని వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు, గ్రామ పెద్దలు, హనుమాన్ యువజన సంఘం ప్రతినిధులు, స్థానిక యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం ఫౌండేషన్ భవిష్యత్ కార్యాచరణపై సభ్యులకు వివరించారు

Sthanikam

నీర్నెంలలో ఘనంగా చరణ్య శ్రీ ఫౌండేషన్ లోగో ఆవిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News