Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తెలుగు జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్(TJWA) మెదక్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ గా వినోద్ కుమార్ నియామకం తెగిన కొండాపూర్ చెరువు కట్ట...సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఎమ్మెల్యే భూపతి రెడ్డి.. కాగితంపై అక్షరాలు కాదు, భవిష్యత్‌ హక్కులకు భరోసా రాసే బాధ్యతాయుత వృత్తి : దస్తావేజు లేఖరి. లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 06, 2026 10:01 PM

నెమ్మికల్ సమీపంలో ఘనంగా వివాహ మహోత్సవం

నెమ్మికల్ సమీపంలో ఘనంగా వివాహ మహోత్సవం

నెమ్మికల్ సమీపంలో ఘనంగా వివాహ మహోత్సవం
26-02-2026 117 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

వధూవరులను ఆశీర్వదించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్

ఆత్మకూరు మండల పరిధిలోని నెమ్మికల్ సమీపంలో గల ఎస్‌వి ఫంక్షన్ హాల్‌లో ఎల్లుట్ల సైదులు రమణ కుమార్తె వివాహ మహోత్సవం శుభ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. బంధుమిత్రులు, గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను విజయవంతం చేశారు. వివాహ వేడుకకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టే జానయ్య యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాంపత్య జీవితం పరస్పర గౌరవం, విశ్వాసం, ప్రేమతో నిండి ఉండాలని ఆకాంక్షించారు. కుటుంబ పెద్దల ఆశీస్సులతో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న వధూవరులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు. సాంప్రదాయ పద్ధతిలో మంగళ వాయిద్యాల నడుమ వివాహ వేడుకలు నిర్వహించారు. వేదికను పూలతో అలంకరించి ఆహ్లాదకర వాతావరణాన్ని సృష్టించారు. బంధువులు, స్నేహితులు వధూవరులను ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వల్లాల సైదులు యాదవ్, పెద్దబోయిన జానకిరాములు, గుంటూరు విజయ్, సుమన్ ఎల్లుట్ల జనయ్య,శివ తదితర నాయకులు పాల్గొని కుటుంబ సభ్యులను అభినందించారు. వేడుక అనంతరం అతిథులకు భోజన విందు ఏర్పాటు చేశారు. వివాహ మహోత్సవం సంతోషకర వాతావరణంలో ముగిసింది

Sthanikam

నెమ్మికల్ సమీపంలో ఘనంగా వివాహ మహోత్సవం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News