Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యువత ప్రతిభకు పట్టాభిషేకం.. ఉజ్వల భవిష్యత్‌కు మార్గదర్శనం యోగ కార్యక్రమంలో పాల్గొన్న సత్యసాయి జిల్లా అధికారులు సచివాలయం , రీ-సర్వే పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన: జేసీ మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై ఉక్కుపాదం రైతు సేవా కేంద్రాల్లో నమోదు చేసుకోవాలని సూచన: AO సంజీవ్ కుమార్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 10, 2026 05:27 PM

నీలం మధు ముదిరాజ్ భక్తులతో కలసి మల్లన్న స్వామి ఉత్సవంలో

నీలం మధు ముదిరాజ్ భక్తులతో కలసి మల్లన్న స్వామి ఉత్సవంలో

నీలం మధు ముదిరాజ్ భక్తులతో కలసి మల్లన్న స్వామి ఉత్సవంలో
January 12, 2026 04:53 AM 20 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మల్లన్న స్వామి ఆశీస్సులతో రుద్రారం జాతర ఘనంగా ఘనంగా

ఉమ్మడి జిల్లా స్థానిక ప్రతినిధి కృష్ణ:తెలంగాణ రాష్ట్ర ప్రజలందరిపై మల్లన్న స్వామి ఆశీస్సులు కురుస్తుండాలని, రాష్ట్రం సుభిక్షంగా, సుఖ సంతోషాలతో అభివృద్ధి చెందాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఆదివారం ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని రుద్రారం గ్రామంలో ఘనంగా జరిగే మల్లన్న స్వామి జాతర మహోత్సవంలో పాల్గొన్న ఆయనకు నిర్వాహకులు ప్రత్యేక స్వాగతం పలికారు. కార్యక్రమంలో మల్లన్న స్వామి దర్శనానంతరం ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ మాట్లాడుతూ, జాతరలు మరియు ఉత్సవాలు తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబిస్తాయని, గ్రామాల్లో జరిగే ఉత్సవాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని పెంచి, ప్రజలను ఐక్యమత్యంగా కలిపి ఉంచుతాయని వివరించారు.మల్లన్న స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఎదుగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక రాజకీయ నాయకులు, గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్‌లు, కార్యకర్తలు, మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు. ముఖ్యంగా కూర్మ వెంకన్న, సుధీర్ రెడ్డి, ప్రభు, వంశీ కృష్ణ, ప్రశాంత్, గణేష్, చంటి, మహేష్, కార్తీక్, అశోక్, మహేష్, ప్రవీణ్ తదితరులు ఉత్సవంలో హాజరయ్యారు.మహోత్సవం ఘనంగా సాగింది, భక్తుల ఆధ్యాత్మిక ఉత్సాహం, కలిసికట్టుగా జరిపిన కార్యక్రమాలు, మరియు మల్లన్న స్వామి ఆశీస్సులు సమాజాన్ని ఒకతరహా ఐక్యమయం చేసేవి అని ప్రతి ఒక్కరు భావించారు. ఈ జాతర తెలంగాణ సాంస్కృతిక సంపదను ప్రతిబింబించేలా, గ్రామస్థుల మధ్య ఐక్యత, సానుభూతిని పెంపొందించేలా నిలిచింది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News