Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

నెలరోజులుగా అదృశ్యమైన యువకుడు

నెలరోజులుగా అదృశ్యమైన యువకుడు

నెలరోజులుగా అదృశ్యమైన యువకుడు
25-02-2026 339 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మండల పరిధిలోని జై కేసారం గ్రామానికి చెందిన ఓ యువకుడు గత నెలరోజులుగా అదృశ్యమైన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామానికి చెందిన సూర దామోదర్ (33) అనే వ్యక్తి రాత్రి సమయంలో ఇంటి నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయి ఇప్పటివరకు తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, దామోదర్‌కు గత ఐదు నెలలుగా మానసిక సమస్యలు ఉండటంతో హైదరాబాద్ ఎర్రగడ్డలోని ప్రభుత్వ మానసిక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అప్పుడప్పుడు ఇంటి నుండి బయటకు వెళ్లిపోయే అలవాటు ఉన్నప్పటికీ, ఇంతకాలం పాటు తిరిగి రాకపోవడం ఇదే మొదటిసారిగా జరుగుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.అతని వద్ద ఎటువంటి మొబైల్ ఫోన్ కూడా లేదని, బంధువుల ఇళ్లలో, పరిసర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదని పేర్కొన్నారు. దామోదర్ ఎత్తు సుమారు 6 అడుగులు 1 అంగుళం ఉండి, తెలుపు వర్ణంతో ఉంటాడని తెలిపారు.ఈ మేరకు అతని తమ్ముడు సూర శేఖర్ చౌటుప్పల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి సీఐ మన్మధ కుమార్ దర్యాప్తు చేపట్టారు. సమాచారం తెలిసిన వారు సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేశారు.

Sthanikam

నెలరోజులుగా అదృశ్యమైన యువకుడు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News