Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:20 PM

నేలమట్టమైన ఇండ్లను పరిశీలించిన అధికారులు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందేలా చర్యలు: ఆర్ఐ శోభ

27-05-2026 32 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఉత్తటూరు గ్రామంలో ఈదురుగాలులు, భారీ వర్షాలకు నేలమట్టమైన ఇండ్ల ఘటనపై అధికారులు స్పందించారు. గ్రామంలో దెబ్బతిన్న ఇండ్లను రామన్నపేట ఆర్ఐ శోభ బుధవారం పరిశీలించి బాధిత కుటుంబాలతో మాట్లాడారు.

మంగళవారం కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు గ్రామానికి చెందిన ఉయ్యాల యాదమ్మ, జట్టి వెంకన్న, పొనుగోటి రజిత, ఏనుగు మాధవరెడ్డి తదితరుల ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. నివాసాలు కోల్పోయిన కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉండగా, విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు గ్రామంలో పర్యటించారు.

ఇండ్ల నష్టాన్ని పరిశీలించిన ఆర్ఐ శోభ మాట్లాడుతూ.. బాధితుల వివరాలను ప్రభుత్వానికి నివేదించి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోళ్ల రామకృష్ణ, జీపీవో నరసింహ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

నేలమట్టమైన ఇండ్లను పరిశీలించిన అధికారులు. బాధిత కుటుంబాలకు నష్టపరిహారం అందేలా చర్యలు: ఆర్ఐ శోభ

Article Image

రామన్నపేట మండలంలోని ఉత్తటూరు గ్రామంలో ఈదురుగాలులు, భారీ వర్షాలకు నేలమట్టమైన ఇండ్ల ఘటనపై అధికారులు స్పందించారు. గ్రామంలో దెబ్బతిన్న ఇండ్లను రామన్నపేట ఆర్ఐ శోభ బుధవారం పరిశీలించి బాధిత కుటుంబాలతో మాట్లాడారు.

మంగళవారం కురిసిన భారీ వర్షం, ఈదురుగాలులకు గ్రామానికి చెందిన ఉయ్యాల యాదమ్మ, జట్టి వెంకన్న, పొనుగోటి రజిత, ఏనుగు మాధవరెడ్డి తదితరుల ఇండ్లు పూర్తిగా దెబ్బతిన్నాయి. నివాసాలు కోల్పోయిన కుటుంబాలు తీవ్ర ఆందోళనలో ఉండగా, విషయం తెలుసుకున్న రెవెన్యూ అధికారులు గ్రామంలో పర్యటించారు.

ఇండ్ల నష్టాన్ని పరిశీలించిన ఆర్ఐ శోభ మాట్లాడుతూ.. బాధితుల వివరాలను ప్రభుత్వానికి నివేదించి నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకెళ్లి బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కోళ్ల రామకృష్ణ, జీపీవో నరసింహ, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News