న్యాల్కల్: మండలంలోని వడ్డి గ్రామంలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎమ్) ఆధ్వర్యంలో గురువారం ఫీల్డ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు సిఎస్వి 41 రకాల విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మండల వ్యవసాయ అధికారి అవినాష్ శర్మ మాట్లాడుతూ రైతులు ఆధునిక సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా పంటల దిగుబడిని పెంచుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధి కోసం అందిస్తున్న పథకాలు, సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.పంటల మార్పిడి విధానాలు, భూసారం పెంపు, మెరుగైన విత్తనాల వినియోగం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ అధికారులు అందిస్తున్న సూచనలను పాటించడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవో మాధవి, స్థానిక రైతులు పాల్గొన్నారు.
PRINT TIME: October 15, 2026 11:35 AM
న్యాల్కల్‌లో రైతులకు 41 రకాల విత్తనాల పంపిణీ

12-03-2026
37 Views
స్థానికం ప్రతినిధి :
Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy
న్యాల్కల్: మండలంలోని వడ్డి గ్రామంలో నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్ (ఎన్‌ఎఫ్‌ఎస్‌ఎమ్) ఆధ్వర్యంలో గురువారం ఫీల్డ్ డే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులకు సిఎస్వి 41 రకాల విత్తనాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మండల వ్యవసాయ అధికారి అవినాష్ శర్మ మాట్లాడుతూ రైతులు ఆధునిక సాగు పద్ధతులను అనుసరించడం ద్వారా పంటల దిగుబడిని పెంచుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం వ్యవసాయ అభివృద్ధి కోసం అందిస్తున్న పథకాలు, సబ్సిడీలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.పంటల మార్పిడి విధానాలు, భూసారం పెంపు, మెరుగైన విత్తనాల వినియోగం వంటి అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. వ్యవసాయ అధికారులు అందిస్తున్న సూచనలను పాటించడం ద్వారా రైతులు అధిక దిగుబడులు సాధించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఈవో మాధవి, స్థానిక రైతులు పాల్గొన్నారు.

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి