Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:38 AM

న్యాల్‌కల్‌లో ఘనంగా గంధం ఊరేగింపు, భక్తుల వెల్లువ

03-02-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

జహీరాబాద్ నియోజకవర్గం / న్యాల్‌కల్, సంగారెడ్డి జిల్లా:

న్యాల్‌కల్ మండల కేంద్రంలో ఉర్సు సందర్భంగా సోమవారం రాత్రి గంధం ఊరేగింపు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. దర్గా ప్రాంగణం నుంచి ప్రారంభమైన ఈ ఊరేగింపులో అలంకరించిన ఒంటె, గుర్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. డప్పుల మోగుడు, నినాదాల మధ్య ఊరేగింపు ప్రధాన వీధుల గుండా సాగడంతో న్యాల్‌కల్ భక్తిమయంగా మారింది.గంధపు సువాసన, దువాలు, సలాం మధ్య సాగిన ఊరేగింపును తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, గ్రామస్తులు హాజరయ్యారు. ఉర్సు సందర్భంగా దర్గా పరిసర ప్రాంతాలను విద్యుత్ దీపాలు, పతాకాలతో అందంగా అలంకరించారు.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు తాగునీరు, ఇతర సౌకర్యాలు ఏర్పాటు చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేయడంతో గంధం ఊరేగింపు ప్రశాంతంగా ముగిసింది. ఉర్సు ఉత్సవాలు భక్తుల సందడితో కొనసాగుతున్నాయి.

Sthanikam

న్యాల్‌కల్‌లో ఘనంగా గంధం ఊరేగింపు, భక్తుల వెల్లువ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News