Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:39 AM

న్యాల్కల్‌లో ఘనంగా 359వ ఉర్సు ఉత్సవాలు – రాత్రి గంధం ఊరేగింపుతో భక్తుల సందడి

31-01-2026 28 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా | జహీరాబాద్ నియోజకవర్గం | న్యాల్కల్ మండలం

సంగారెడ్డి జిల్లా, జహీరాబాద్ నియోజకవర్గం పరిధిలోని న్యాల్కల్ మండలంలో 359వ ఉర్సు ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన గంధం ఊరేగింపు అత్యంత ఘనంగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు, స్థానికులు పాల్గొని మత సామరస్యానికి ప్రతీకగా నిలిచారు.రాత్రివేళ ప్రారంభమైన గంధం ఊరేగింపు న్యాల్కల్ పట్టణంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. భక్తులు “యా ఖాజా” నినాదాలతో ఊరేగింపులో పాల్గొనగా, ఉత్సవ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. చిన్నారుల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహంగా పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.ఉర్సు ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు, నిర్వాహకులు ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశారు. విద్యుత్ వెలుగుల అలంకరణలు, భక్తుల రాకపోకల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో ఉత్సవాలు శాంతియుతంగా కొనసాగుతున్నాయి.

ఈ ఉర్సు ఉత్సవాలు ఫిబ్రవరి 6 వరకు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. వివిధ ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ప్రార్థనలు, ప్రత్యేక దువాలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయని పేర్కొన్నారు. పరిసర గ్రామాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని తెలిపారు.

Sthanikam

న్యాల్కల్‌లో ఘనంగా 359వ ఉర్సు ఉత్సవాలు – రాత్రి గంధం ఊరేగింపుతో భక్తుల సందడి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News