Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 09:24 AM

న్యాల్కల్‌లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

న్యాల్కల్‌లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

న్యాల్కల్‌లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు
15-02-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

కేతకి సంగమేశ్వరునికి శివమాల భక్తుల పాదయాత్ర

న్యాల్కల్ : సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామంలోని శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తెల్లవారుజామున నుంచే శివభక్తులు భారీగా ఆలయానికి తరలి వచ్చి అభిషేకాలు, రుద్రపఠనాలు చేశారు. దీక్షలు ధరించిన భక్తులు సంప్రదాయ వేషధారణలో దర్శనమిచ్చి ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపారు. గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు.

అనంతరం న్యాల్కల్ గ్రామానికి చెందిన శివమాల భక్తులు ఝరాసంగం మండలంలోని ప్రసిద్ధ కేతకి సంగమేశ్వరాలయానికి పాదయాత్రగా బయలుదేరారు. శివనామస్మరణలతో, భజనలతో సాగిన ఈ యాత్రలో యువకులు, పెద్దలు ఉత్సాహంగా పాల్గొన్నారు. మార్గమధ్యంలో భక్తులకు గ్రామ ప్రజలు నీరు, ప్రసాదం అందించి సేవలందించారు.

కేతకి సంగమేశ్వరాలయానికి పాదయాత్రగా బయలుదేరిన న్యాల్కల్ శివమాల భక్తులు

Sthanikam

న్యాల్కల్‌లో ఘనంగా మహాశివరాత్రి వేడుకలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News