Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:40 AM

న్యాల్కల్‌లో గాలివాన, వడగండ్ల బీభత్సం… చనిగేపల్లిలో కూలిన కరెంటు స్తంభాలు

16-03-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల పరిధిలోని చనిగేపల్లి గ్రామంలో ఆదివారం అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షం, బలమైన ఈదురుగాలులు మరియు వడగండ్ల వానతో గ్రామంలో బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా మారిన వాతావరణంతో గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గాలుల తీవ్రతకు పలు చెట్లు విరిగి రహదారులపై పడిపోవడంతో కొంతసేపు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.అదే సమయంలో గ్రామంలోని కొన్ని విద్యుత్ స్తంభాలు కూలిపోవడంతో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. చెట్లు మరియు విద్యుత్ తీగలు రహదారిపై పడిపోవడంతో గ్రామ ప్రజలు బయటకు రావడానికి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది, గ్రామస్థుల సహకారంతో సంఘటనా స్థలానికి చేరుకుని కూలిన చెట్లు, విద్యుత్ స్తంభాలను తొలగించే పనులు ప్రారంభించారు.విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. గాలివాన కారణంగా గ్రామంలో కొన్ని చోట్ల చిన్నపాటి నష్టం సంభవించినట్లు సమాచారం. ఈ ఘటనతో గ్రామ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ అధికారులు త్వరగా విద్యుత్ సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.

Sthanikam

న్యాల్కల్‌లో గాలివాన, వడగండ్ల బీభత్సం… చనిగేపల్లిలో కూలిన కరెంటు స్తంభాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News