Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:37 AM

న్యాల్కల్ ఉర్సే షీరీఫ్ జాతర ప్రారంభం – పశువుల జాతర ప్రత్యేక ఆకర్షణ

01-02-2026 31 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్, సంగారెడ్డి జిల్లా :

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రంలోని న్యాల్కల్ గ్రామంలో ఉర్సే షీరీఫ్ ఫీర్ గైబ్ సాహెబ్ జాతర ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వారంరోజుల పాటు కొనసాగనున్న ఈ జాతరకు ఉమ్మడి మెదక్ జిల్లా తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి దర్గాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.

జాతర ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నిర్వహించిన పశువుల జాతర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వివిధ ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో పశువులు తరలివచ్చాయి. రైతులు కొనుగోలు–అమ్మకాలతో బిజీగా ఉండగా, కోట్ల రూపాయల విలువైన వ్యాపారం కొనసాగింది.

ఈ సందర్భంగా మేలైన పశువులను ఎంపిక చేసి, న్యాల్కల్ గ్రామానికి చెందిన శిల్పకళాకారుడు డాక్టర్ హోతి బస్వరాజ్ తన తల్లిదండ్రులు, అన్న కుమారుడి జ్ఞాపకార్థంగా రైతులకు బసవ అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమానికి రైతులు, పశుపోషకులు, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

న్యాల్కల్ ఉర్సే షీరీఫ్ జాతర సందర్భంగా నిర్వహించిన పశువుల జాతరలో పాల్గొన్న రైతులు, పశువులు.

ప్రాంతం : న్యాల్కల్ మండలం, సంగారెడ్డి జిల్లా

రిపోర్టర్ : సంగమేశ్వర్ రెడ్డి

Sthanikam

న్యాల్కల్ ఉర్సే షీరీఫ్ జాతర ప్రారంభం – పశువుల జాతర ప్రత్యేక ఆకర్షణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News