Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:24 AM

న్యాల్కల్ తండా వద్ద అక్రమ ఎర్రరాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.. 400 ఎర్రరాళ్లతో లారీ స్వాధీనం

29-05-2026 26 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

జహీరాబాద్ నియోజకవర్గం

న్యాల్కల్ మండలంలోని న్యాల్కల్ తండా వద్ద అక్రమ ఎర్రరాయి రవాణాను హద్నూర్ పోలీసులు భగ్నం చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణలోకి ఎర్రరాళ్లను తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు అప్రమత్తమై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

న్యాల్కల్ తండా సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా వచ్చిన లారీని అడ్డగించి తనిఖీ చేయగా, సుమారు 400 ఎర్రరాళ్లు ఉన్నట్లు గుర్తించారు. రవాణాకు సంబంధించిన చట్టబద్ధ పత్రాలు, అనుమతులు లేకపోవడంతో లారీని వెంటనే స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ రాథోడ్ శ్రావణ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అక్రమ ఖనిజ రవాణా, సహజ వనరుల దోపిడీకి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోము. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ హెచ్చరించారు.

హద్నూర్ పోలీసుల వేగవంతమైన చర్యతో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రరాళ్లు పట్టుబడగా, ఈ ఘటన అక్రమ ఖనిజ రవాణాదారులకు గట్టిగా హెచ్చరించారు.

Sthanikam

న్యాల్కల్ తండా వద్ద అక్రమ ఎర్రరాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.. 400 ఎర్రరాళ్లతో లారీ స్వాధీనం

Article Image

జహీరాబాద్ నియోజకవర్గం

న్యాల్కల్ మండలంలోని న్యాల్కల్ తండా వద్ద అక్రమ ఎర్రరాయి రవాణాను హద్నూర్ పోలీసులు భగ్నం చేశారు. కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ ప్రాంతం నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా తెలంగాణలోకి ఎర్రరాళ్లను తరలిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో పోలీసులు అప్రమత్తమై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు.

న్యాల్కల్ తండా సమీపంలో వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా వచ్చిన లారీని అడ్డగించి తనిఖీ చేయగా, సుమారు 400 ఎర్రరాళ్లు ఉన్నట్లు గుర్తించారు. రవాణాకు సంబంధించిన చట్టబద్ధ పత్రాలు, అనుమతులు లేకపోవడంతో లారీని వెంటనే స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ ఘటనలో లారీ డ్రైవర్ రాథోడ్ శ్రావణ్‌ను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

అక్రమ ఖనిజ రవాణా, సహజ వనరుల దోపిడీకి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోము. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. జిల్లాలో అక్రమ రవాణాపై ప్రత్యేక నిఘా కొనసాగుతోంది. ఎవరైనా అక్రమ కార్యకలాపాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి అని హద్నూర్ ఎస్సై దోమ సుజిత్ హెచ్చరించారు.

హద్నూర్ పోలీసుల వేగవంతమైన చర్యతో భారీ మొత్తంలో అక్రమంగా తరలిస్తున్న ఎర్రరాళ్లు పట్టుబడగా, ఈ ఘటన అక్రమ ఖనిజ రవాణాదారులకు గట్టిగా హెచ్చరించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News