Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఎంగిలిపూల బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న దేప సురేఖ భాస్కర్ రెడ్డి దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 06:24 AM

న్యాల్కల్, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం తాత్కాలిక మూసివేత

02-03-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలోని ప్రాచీన శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయం మార్చి 3వ తేదీ మంగళవారం చంద్రగ్రహణం సందర్భంగా భక్తుల దర్శనార్థం తాత్కాలికంగా మూసివేయబడనుంది. సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల వరకు ప్రధాన ఆలయం తో పాటు ఉప ఆలయాల ద్వారాలు మూసివేయబడతాయని ఆలయ అధికారులు తెలిపారు.తెలంగాణ రాష్ట్రంలో మరెక్కడా కనిపించని విధంగా స్వయంభువుగా వెలిసిన లింగాకారంలో స్వామివారు దర్శనమివ్వడం ఈ ఆలయానికి విశిష్ట గుర్తింపుగా నిలిచింది. అనాదికాలం నుంచి పూజలు అందుకుంటున్న ఈ క్షేత్రం ప్రాంతీయంగా ప్రసిద్ధి చెందడంతో పాటు మహాశివరాత్రి, కార్తీకమాసం, ప్రతి సోమవారం భక్తులతో కిటకిటలాడుతుంది. స్వామివారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం.

గ్రహణం ముగిసిన అనంతరం రాత్రి 7:45 గంటలకు వేద మంత్రోచ్చారణల మధ్య సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించి స్వామివారి పునఃప్రతిష్ఠ అనంతరం మంగళహారతులు ఇచ్చి భక్తులకు దర్శనం కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు పాల్గొంటారని తెలిపారు. భక్తులు సహకరించాలని ఆలయ అధికారులు కోరారు.

Sthanikam

న్యాల్కల్, శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం తాత్కాలిక మూసివేత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News