Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
దేవి నవరాత్రి ఉత్సవాల నిర్వహణపై పోలీసుల మార్గదర్శకాలు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 11, 2026 08:21 AM

న్యాల్కల్ మండలంలో జొన్నల కొనుగోళ్లు జోరు.. కేంద్రాలకు పోటెత్తుతున్న రైతులు

29-05-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

జహీరాబాద్ నియోజకవర్గం

న్యాల్కల్ మండలంలో జొన్నల కొనుగోళ్లు వేగవంతంగా కొనసాగుతున్నాయి. ఈ నెల 21వ తేదీన ప్రారంభమైన కొనుగోలు కేంద్రాలకు రైతులు పెద్ద ఎత్తున జొన్నలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. న్యాల్కల్ డీసీఎంఎస్, హద్నూర్ పీఏసీఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కొనుగోలు కేంద్రాల్లో ప్రతిరోజూ వందలాది క్వింటాళ్ల జొన్నలు సేకరించబడుతున్నాయి.

మండలంలోని పలు గ్రామాల రైతులు తమ పంటను కొనుగోలు కేంద్రాలకు తరలించి విక్రయిస్తున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు కొనుగోలు ప్రక్రియను పర్యవేక్షిస్తూ, ధాన్యాన్ని వేగంగా సేకరిస్తున్నారు. దీంతో రైతులు సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటివరకు న్యాల్కల్ డీసీఎంఎస్‌లో 3,242 క్వింటాళ్లు, హద్నూర్ పీఏసీఎస్‌లో 2,300 క్వింటాళ్ల జొన్నలను కొనుగోలు చేసినట్లు ఆయా సంస్థల చైర్మన్లు సిద్ధి లింగయ్యస్వామి, జగన్నాథ్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వం కల్పించిన కొనుగోలు సదుపాయాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని వారు అన్నారు.

మంచి దిగుబడులు రావడంతో పాటు ప్రభుత్వ కొనుగోళ్లు వేగంగా కొనసాగుతుండటంతో మండల రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో కొనుగోళ్ల పరిమాణం మరింత పెరిగే అవకాశాలు ఉందని అధికారులు తెలిపారు.

Sthanikam

న్యాల్కల్ మండలంలో జొన్నల కొనుగోళ్లు జోరు.. కేంద్రాలకు పోటెత్తుతున్న రైతులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News