Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:39 AM

న్యాల్కల్ జాతరలో కుస్తీ పోటీల్లో హైదరాబాద్ మల్లయోధుడి ఘన విజయం

04-02-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్,

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండల కేంద్రం న్యాల్కల్ గ్రామ శివారులోని ఉర్సే షరీఫ్ పీరైబ్ సాహెబ్ దర్గా ప్రాంగణంలో నిర్వహించిన అంతర్రాష్ట్ర కుస్తీ పోటీలు ఉత్సాహభరితంగా ముగిశాయి. మహారాష్ట్ర–హైదరాబాద్ మల్లయోధుల మధ్య జరిగిన కీలక పోటీలో హైదరాబాద్‌కు చెందిన కుశాల్ ఘన విజయం సాధించారు.విజేతగా నిలిచిన కుశాల్‌కు నిర్వాహకులు రూ.25,000 నగదు బహుమానం అందజేసి, శాలువాతో ఘనంగా సన్మానించారు. గ్రామ పెద్దల సమక్షంలో జాతర ప్రాంగణంలో ఈ బహుమతి ప్రదానం జరిగింది. పోటీలు యువత కేరింతలు, ఈలల నడుమ ‘నువ్వా నేనా’ అన్నట్టుగా సాగి ప్రేక్షకులను విశేషంగా అలరించాయి.ఈ కార్యక్రమంలో న్యాల్కల్ గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి ప్రవీణ్ కుమార్, న్యాల్కల్ జెడ్పీటీసీ స్వప్న భాస్కర్, ఎంపీటీసీ తనయుడు వెంకట్, హోతి నాగిశెట్టి, బొల్లి కాశప్ప, న్యాల్కల్ బీఆర్‌ఎస్ అధ్యక్షులు సున్నపు సత్యనారాయణ, ఇసాం పటేల్, న్యాల్కల్ పంచాయతీ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, విట్టల్ రెడ్డి పటేల్ తదితరులు పాల్గొన్నారు.జాతర సందర్భంగా నిర్వహించిన ఈ కుస్తీ పోటీలు ప్రజలను విశేషంగా ఆకట్టుకుని న్యాల్కల్ జాతర వైభవాన్ని మరింత పెంచాయని నిర్వాహకులు తెలిపారు.

Sthanikam

న్యాల్కల్ జాతరలో కుస్తీ పోటీల్లో హైదరాబాద్ మల్లయోధుడి ఘన విజయం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News