Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:36 AM

న్యాల్కల్ గ్రామంలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభం

10-03-2026 33 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని గ్రామంలో ప్రారంభించారు. గ్రామాన్ని పరిశుభ్రంగా, అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యాచరణ ప్రణాళిక మార్చి 6 నుండి జూన్ 12 వరకు కొనసాగనుంది.ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని డ్రైనేజీల శుభ్రపరిచే పనులు, చెత్త తొలగింపు, రహదారుల పరిసరాల పరిశుభ్రత, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల అభివృద్ధి వంటి పలు కార్యక్రమాలు చేపట్టనున్నారు. గ్రామాన్ని స్వచ్ఛంగా ఉంచడం ప్రతి గ్రామస్థుడి బాధ్యత అని నాయకులు పేర్కొన్నారు. గ్రామాభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకొస్తున్న కార్యక్రమాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో న్యాల్కల్ గ్రామ సర్పంచ్ జ్యోతిలక్ష్మి – ప్రవీణ్ కుమార్, సహకార సంఘం మాజీ చైర్మన్ సిద్ది లింగయ్య స్వామి, అంజి, పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, అలాగే గ్రామ యువకులు, పెద్దలు పాల్గొన్నారు. గ్రామ అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలంతా భాగస్వాములు కావాలని వారు పిలుపునిచ్చారు.

Sthanikam

న్యాల్కల్ గ్రామంలో 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News