Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:39 AM

నవోదయం 2.0లో భాగంగా నాటు సారాపై ఎక్సైజ్ దాడులు ఇద్దరు అరెస్ట్ – 5 లీటర్ల నాటు సారాయి స్వాధీనం

12-03-2026 108 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్ రాయి : నాటు సారా రహిత ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవోదయం 2.0 కార్యక్రమంలో భాగంగా నూజివీడు ప్రొహిబిషన్ మరియు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో అధికారులు దాడులు నిర్వహించారు. అసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ సి.హెచ్. అజయ్ కుమార్ సింగ్ ఆధ్వర్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌స్పెక్టర్ పి.ఎస్.డి. భోగేశ్వరరావు, నూజివీడు స్టేషన్ సిబ్బంది కలిసి చాట్రాయి మండలం మర్లపాలెం గ్రామంలో తనిఖీలు చేపట్టారు.

ఈ దాడుల్లో మర్లపాలెం గ్రామానికి చెందిన గుర్రం వెంకట మారేషు (తండ్రి నమ్మయ్య), ధనికొండ శ్రీను (తండ్రి నాగేశ్వరరావు)లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి సుమారు 5 లీటర్ల నాటు సారాయిని, ఒక బజాజ్ ప్లాటినం మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు.

అలాగే వీరికి నాటు సారాను సరఫరా చేస్తున్న చాట్రాయి మండలం పోతనపల్లి పెద్ద తండాకు చెందిన హస్సావతు కమలం (భర్త వెంకటేశ్వరరావు)పై కూడా కేసు నమోదు చేసినట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఎ. మస్తానయ్య తెలిపారు.

నూజివీడు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని ఆగిరిపల్లి, నూజివీడు, ముసునూరు, చాట్రాయి మండలాల్లో బెల్ట్ షాపులు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాటు సారా తయారీ, విక్రయం, నిల్వ చేయడం నేరమని తెలిపారు. అలాగే నాటు సారా తయారీలో ఉపయోగించే బెల్లం సరఫరా చేసే వ్యాపారులు, బెల్లపు ఊటలకు భూమి ఇచ్చే యజమానులపై కూడా కేసులు నమోదు చేస్తామని పేర్కొన్నారు.

నాటు సారా తయారీ లేదా విక్రయం గురించి సమాచారం ఉంటే ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ఫోన్ నంబర్ 9440902462కు తెలియజేయాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని ఈ సందర్భంగా తెలిపారు.

Sthanikam

నవోదయం 2.0లో భాగంగా నాటు సారాపై ఎక్సైజ్ దాడులు ఇద్దరు అరెస్ట్ – 5 లీటర్ల నాటు సారాయి స్వాధీనం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News