Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 10:21 AM

నారాయణఖేడ్‌లో మారుతున్న రాజకీయ గాలి – కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

03-02-2026 484 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నారాయణఖేడ్ మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఉమ్మడి జిల్లా మాజీ ప్రణాళిక సంఘం సభ్యులు నాగేష్ షేట్కార్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.పట్టణంలోని 8వ వార్డు మనసునపూర్‌కు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు తుకరాం తో పాటు ఆయన అనుచరులు సుమారు 25 మంది కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు నూతనంగా చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి ఘనంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు, కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, ప్రజలకు దగ్గరగా ఉండే పాలన విధానాలు తమను ఆకర్షించాయని తెలిపారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా సమిష్టిగా పనిచేస్తామని, పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని నూతనంగా చేరిన నాయకులు, కార్యకర్తలు స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో పీసీసీ సభ్యులు కే. శ్రీనివాస్,రహీం, గౌస్ చిస్తీ, డ్యానియల్, మైపాల్, విట్టల్ తదితర కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. ఈ చేరికలతో నారాయణఖేడ్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీకి మరింత బలం చేకూరిందని స్థానిక నాయకులు అభిప్రాయపడ్డారు.

Sthanikam

నారాయణఖేడ్‌లో మారుతున్న రాజకీయ గాలి – కాంగ్రెస్ పార్టీలో భారీ చేరికలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News