Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:20 PM

నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వ బడులే ఉత్తమం.. తల్లిదండ్రులకు అవగాహన

08-06-2026 118 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలంలోని డేగుల్‌వాడి ప్రాథమికోన్నత పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజన పథకం, క్రీడా సౌకర్యాలు తదితర అంశాల గురించి అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం మెరుగైన సౌకర్యాలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయని వివరించి, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. పాఠశాలపై విశ్వాసం ఉంచి ఎక్కువ మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్, శ్రీనివాస్ యాదవ్, ప్రధానోపాధ్యాయుడు సన్‌శెట్టి, ఉపాధ్యాయ బృందం సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

నాణ్యమైన విద్య కోసం ప్రభుత్వ బడులే ఉత్తమం.. తల్లిదండ్రులకు అవగాహన

Article Image

నారాయణఖేడ్ నియోజకవర్గంలో కంగ్టి మండలంలోని డేగుల్‌వాడి ప్రాథమికోన్నత పాఠశాల ఆధ్వర్యంలో బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ బృందం గ్రామంలో ఇంటింటికీ వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న నాణ్యమైన విద్య, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు, మధ్యాహ్న భోజన పథకం, క్రీడా సౌకర్యాలు తదితర అంశాల గురించి అవగాహన కల్పించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం మెరుగైన సౌకర్యాలు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేస్తున్నాయని వివరించి, తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని తల్లిదండ్రులను కోరారు. పాఠశాలపై విశ్వాసం ఉంచి ఎక్కువ మంది విద్యార్థులను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నవీన్ కుమార్, శ్రీనివాస్ యాదవ్, ప్రధానోపాధ్యాయుడు సన్‌శెట్టి, ఉపాధ్యాయ బృందం సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News