Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
విద్యార్థుల ప్రాథమిక నైపుణ్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: జిల్లా కలెక్టర్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 30, 2026 12:04 AM

నాలుగేళ్ల సమస్యకు నాలుగు గంటల్లోనే పరిష్కారం

18-02-2026 255 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సొంత యంత్రంతో పనులు పూర్తి చేయించిన చైర్‌పర్సన్ – మొరిశెట్టి నివేదిత లక్షాధికి కాలనీవాసుల కృతజ్ఞతలు

నాలుగేళ్లుగా పరిష్కారం కాని సమస్యకు కేవలం నాలుగు గంటల్లోనే ముగింపు పలికిన సంఘటన సూర్యాపేట పట్టణంలో చోటుచేసుకుంది. నూతన మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాధి స్పందనతో కాలనీవాసులు ఊపిరి పీల్చుకున్నారు.

జిల్లా కేంద్రంలోని అమ్మ గార్డెన్ సమీప 17, 19 వార్డుల మధ్య ఉన్న కాలనీలో పైప్రాంతాల నుంచి వర్షపు నీరు చేరి వీధులు మునిగిపోతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇండ్ల నుంచి బయటకు రావడమే కష్టంగా మారి, చిన్నపిల్లలు, వృద్ధులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత నాలుగేళ్లుగా మున్సిపల్ అధికారులకు, జిల్లా అధికారులకు ఫిర్యాదులు చేసినప్పటికీ శాశ్వత పరిష్కారం లభించలేదని కాలనీవాసులు తెలిపారు. ఎన్నికల సమయంలో కూడా సమస్యను ప్రస్తావించినా ఫలితం లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం బాధ్యతలు స్వీకరించిన చైర్‌పర్సన్ నివేదిత లక్షాధిని కలిసి సమస్యను వివరించగా, వెంటనే స్పందించారు. మున్సిపల్ యంత్రం మరమ్మతులో ఉండటంతో, సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆమె తన సొంత యంత్రాన్ని వినియోగించి పనులు ప్రారంభించించారు. రోడ్లపై నిల్వ ఉన్న నీటిని గుంతలు తవ్వి కాలువల వైపు మళ్లించే చర్యలు చేపట్టి నాలుగు గంటల్లోనే సమస్యను పరిష్కరించారు. దీంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేస్తూ చైర్‌పర్సన్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల సమస్యల పట్ల వెంటనే స్పందించి చర్యలు తీసుకున్న చైర్‌పర్సన్‌కు “శభాష్” అంటూ అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Sthanikam

నాలుగేళ్ల సమస్యకు నాలుగు గంటల్లోనే పరిష్కారం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News