Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:38 AM

నల్లగొండ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు..

25-03-2026 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు..

రూ. 30 వేల జరిమానా వివరాలు వెల్లడించిన ఎస్పీ శరత్ చంద్ర పవార్..

​నల్లగొండ : నల్లగొండ పట్టణంలో ఎనిమిదేళ్ల క్రితం చోటుచేసుకున్న ట్రాక్టర్ డ్రైవర్ హత్య కేసులో నిందితుడికి కోర్టు జీవిత ఖైదు విధిస్తూ బుధవారం సంచలన తీర్పు వెలువరించింది. నల్లగొండ ప్రత్యేక ఎస్సీ/ఎస్టీ (POA) చట్ట కేసుల విచారణ కోర్టు – II అదనపు జిల్లా మరియు సెషన్స్ న్యాయమూర్తి ఈ మేరకు శిక్షను ఖరారు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఒక ప్రకటనలో తెలిపారు.ఘటన వివరాల్లోకి వెళ్తే.. కనగల్ గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ పాలకురి రమేష్ (30) వ్యక్తిగత విభేదాలు, పాత గొడవల కారణంగా 2018 జనవరి 28వ తేదీ రాత్రి నల్లగొండ పట్టణంలోని భారత్ గ్యాస్ గోదాం సమీపంలో దారుణ హత్యకు గురయ్యారు. మరుసటి రోజు ఉదయం మృతుని సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నల్లగొండ టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మొహమ్మద్ మొసిన్ ఖాన్ (A1) విచారణ దశలో ఉండగానే మరణించగా, రెండో నిందితుడు మొహమ్మద్ దుర్వేశ్ మొహియుద్దీన్ అలియాస్ నయాబ్ (A2) పై నేరం నిరూపితమైంది.నేరం రుజువు కావడంతో న్యాయస్థానం నిందితుడికి భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్ 302 ప్రకారం జీవిత ఖైదుతో పాటు 10 వేల రూపాయల జరిమానా విధించింది. జరిమానా చెల్లించని పక్షంలో మరో ఆరు నెలల సాధారణ కారాగార శిక్ష అనుభవించాలని స్పష్టం చేసింది. వీటితో పాటు సాక్ష్యాధారాల మాయం (IPC 201) కింద మూడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 10 వేల జరిమానా, అలాగే సెక్షన్ 153(A) కింద మరో ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ. 10 వేల జరిమానా విధించింది. అయితే కోర్టు ఆదేశాల ప్రకారం ఈ శిక్షలన్నీ ఏకకాలంలో అమలు అవుతాయని ఎస్పీ వివరించారు.ఈ కేసులో నిందితుడికి శిక్ష పడేలా పక్కా ఆధారాలతో కృషి చేసిన ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆర్. అఖిల, అప్పటి దర్యాప్తు అధికారులు సబ్ ఇన్‌స్పెక్టర్ డి. మధు, సీఐలు ఎన్. వెంకటేశ్వర్లు, మహబూబ్ బాషాలను ఎస్పీ అభినందించారు. అలాగే ప్రస్తుతం ఈ కేసును పర్యవేక్షించిన డీఎస్పీ శివరాం రెడ్డి, టూటౌన్ సీఐ ఎస్. రాఘవరావు, ఎస్ఐ వై. సైదులు, సీడీఓ సుమన్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్లు నరేందర్, మల్లికార్జున్‌లను ఎస్పీ ప్రత్యేకంగా ప్రశంసించారు.

Sthanikam

నల్లగొండ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పు..

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News