Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల డిమాండ్లపై మహాధర్నా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 28, 2026 07:42 AM

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిశానిర్దేశం

01-02-2026 241 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సన్నద్ధంపై రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మున్సిపల్ కార్పొరేషన్ కార్పొరేటర్ అభ్యర్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థులకు ఎన్నికల వ్యూహం, ప్రజలతో ఉండాల్సిన అనుబంధంపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.

“మీరు గెలిస్తే నేను గెలిచినట్టే. మీ గెలుపే నా గెలుపు, పేద ప్రజల గెలుపు” అని మంత్రి వ్యాఖ్యానించారు. మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో, అన్ని 48 డివిజన్లలో పార్టీ అభ్యర్థులే గెలవాలని ఆకాంక్షించారు.

సీట్ల కేటాయింపులో సామాజిక వర్గాలకు సమన్యాయం చేశామని, ముఖ్యంగా బీసీలకు 70 శాతం సీట్లు కేటాయించి నల్లగొండను రాష్ట్రానికి ఆదర్శంగా నిలిపామని తెలిపారు. అన్ని వర్గాలను కలుపుకుని పోతేనే విజయం సాధ్యమని అభ్యర్థులకు సూచించారు.

“మీరు గెలిచి రండి… అభివృద్ధిని నాకు వదిలేయండి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని అడిగి అవసరమైనన్ని నిధులు తెస్తా” అని హామీ ఇచ్చారు. అధికార పార్టీ కార్పొరేటర్లు గెలిస్తే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎలాంటి అడ్డంకులు ఉండవని స్పష్టం చేశారు.

ప్రజల దగ్గరికి ఓట్ల కోసం వెళ్లినట్లే, వారి మంచి–చెడులోనూ భాగస్వాములుగా ఉండాలని సూచించారు. “పేదవారికి కష్టం వస్తే నా కళ్లలో నీళ్లు తిరుగుతాయి. 30 ఏళ్లుగా నా నల్లగొండ ప్రజలకు నేనెవరో తెలుసు” అని భావోద్వేగంగా మాట్లాడారు.

ఇటీవల పత్రికల్లో వచ్చిన రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని తెలిపారు. ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న విషయం బాధ కలిగించిందన్నారు. ఇలాంటి కష్టాలు తనకు వెంటనే తెలియాలంటే కార్పొరేటర్లు తమ డివిజన్లలో ప్రజలకు ప్రతినిధులుగా ఉండాలని సూచించారు.

పేద ప్రజలకు మేలు చేయాలనే లక్ష్యంతోనే కార్పొరేటర్లుగా ఎన్నిక కావాలని, ప్రతి ఓటరును కలిసి భరోసా ఇవ్వాలని మంత్రి కోరారు. నల్లగొండలో తాను ఉన్నంతకాలం అశాంతికి తావుండదని స్పష్టం చేస్తూ, అన్ని స్థానాల్లో ఖచ్చితంగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చివరగా అభ్యర్థులందరికీ “ఆల్ ది బెస్ట్” తెలిపారు.

Sthanikam

నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి దిశానిర్దేశం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News