Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 10:03 AM

నకిలీ జర్నలిస్టులపై కఠిన చర్యలు అవసరం

నకిలీ జర్నలిస్టులపై కఠిన చర్యలు అవసరం

నకిలీ జర్నలిస్టులపై కఠిన చర్యలు అవసరం
23-03-2026 152 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జర్నలిస్టులు ఐక్యతతో ముందుకు రావాలి

జర్నలిజం పేరుతో దందాలు, బ్లాక్మెయిల్ చర్యలకు పాల్పడుతున్న నకిలీ జర్నలిస్టులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీనియర్ జర్నలిస్టులు పిలుపునిచ్చారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలోని దేవి గ్రాండ్‌లో నిర్వహించిన జర్నలిస్టుల సమావేశంలో ఈ విషయాన్ని స్పష్టం చేశారు.

ఈ సమావేశాన్ని డివిజన్ అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి నరేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు లట్టుపల్లి మోహన్ రెడ్డి, ఖాజా పాషా మాట్లాడుతూ నకిలీ జర్నలిస్టుల వల్ల అసలైన జర్నలిస్టులకు చెడ్డ పేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

జర్నలిజాన్ని సేవా దృక్పథంతో చూడాలని, బతుకుదెరువు కోసం ఇతర వృత్తులను కూడా చేపట్టాలని సూచించారు. వార్తలు సేకరించి ప్రజలకు అందించేవారే నిజమైన జర్నలిస్టులని, బ్లాక్మెయిల్‌కు పాల్పడేవారు జర్నలిస్టులు కాదని స్పష్టం చేశారు.

జర్నలిస్టుల పేరుతో దాడులకు పాల్పడే ఘటనలను తీవ్రంగా ఖండిస్తూ, అలాంటి వారిని అరికట్టేందుకు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. నకిలీ జర్నలిస్టుల కారణంగా సమాజంలో జర్నలిస్టుల ప్రతిష్ఠ దెబ్బతింటోందని పేర్కొన్నారు.

జర్నలిస్టులకు సరైన శిక్షణ అవసరమని, త్వరలో శిక్షణ తరగతులు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే అసలైన జర్నలిస్టుల జాబితా రూపొందించి అధికారులకు అందజేయాలని సూచించారు.

ఈ సమావేశంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు, జిల్లా నాయకులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

నకిలీ జర్నలిస్టులపై కఠిన చర్యలు అవసరం

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News