Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:12 PM

నిదానపల్లి గ్రామపంచాయతీ మరోసారి ఏకగ్రీవం ప్రజాస్వామ్యానికి నిదర్శనం

08-12-2025 546 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి - కొండ మల్లేశం గౌడ్

స్థానికంయాదాద్రి–భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలో నిదానపల్లి గ్రామం మరోసారి ఏకగ్రీవ ఫలితాలతో చరిత్ర సృష్టించింది. గ్రామస్థుల ఐక్యత, నాయకత్వంపై నమ్మకం మరోసారి రుజువైంది.

2001లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నిదానపల్లి గ్రామపంచాయతీ ఏకగ్రీవంగా కట్టగురి మల్లయ్యను సర్పంచిగా ఎన్నుకుని రాష్ట్రంలో ఆదర్శంగా నిలిచింది. ఇప్పుడు అదే విశ్వాసాన్ని కొనసాగిస్తూ, తెలంగాణ ఏర్పాటుకు తర్వాత జరిగిన 2025 స్థానిక సంస్థల ఎన్నికల్లో నారపాక మాధవి యాదయ్యను సర్పంచిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

గ్రామంలోని 8 వార్డులపై ఒక్క సవాలు కూడా లేకుండా అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవ్వడం, ప్రజల ఏకాభిప్రాయం, గ్రామాభివృద్ధిపై ఎదుగుతున్న అవగాహనకు ప్రతీకగా స్థానికులు పేర్కొంటున్నారు. ఉప సర్పంచ్ పదవి కూడా ఏకగ్రీవంగానే భర్తీ కావడం పంచాయతీ రాజకీయాల్లో అరుదైన సంఘటనగా స్థానిక ప్రజలు అభినందిస్తున్నారు.గ్రామం మొత్తం పండగ వాతావరణాన్ని సంతరించుకుంది. పెద్దలు, యువత, మహిళలు కలిసి గ్రామ ఐక్యత కోసం చూపిన తీరును నాయకులు ప్రశంసించారు. నాయకత్వంపై ప్రజలు ఉంచిన నమ్మకాన్ని మరింత బలోపేతం చేస్తామని కొత్త సర్పంచ్ నారపాక మాధవి యాదయ్య హామీ ఇచ్చారు.నిదానపల్లి గ్రామం మరోసారి ప్రజాస్వామ్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది.

Sthanikam

నిదానపల్లి గ్రామపంచాయతీ మరోసారి ఏకగ్రీవం ప్రజాస్వామ్యానికి నిదర్శనం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News