Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:17 PM

నాగిరెడ్డిపల్లిలో మహిళా భవనానికి భూమిపూజ. రూ.10 లక్షలతో నిర్మాణ పనులకు శ్రీకారం

27-05-2026 43 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో నూతన మహిళా భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ రాఘవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం భూమిపూజ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అమలు చేస్తున్న పథకాలలో భాగంగా రూ.10 లక్షల వ్యయంతో ఈ భవనం నిర్మించనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సహకారంతో గ్రామ మహిళా సంఘాల సభ్యుల కోసం ప్రత్యేక భవనం నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మహిళలు ఒకేచోట సమావేశమై తమ సమస్యలు చర్చించుకునేందుకు ఈ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, పాత రుణాలపై వడ్డీ మాఫీ, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని నాయకులు వివరించారు. మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ, అధికారులు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

నాగిరెడ్డిపల్లిలో మహిళా భవనానికి భూమిపూజ. రూ.10 లక్షలతో నిర్మాణ పనులకు శ్రీకారం

Article Image

భువనగిరి మండలం నాగిరెడ్డిపల్లి గ్రామంలో నూతన మహిళా భవన నిర్మాణానికి గ్రామ సర్పంచ్ రాఘవేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం భూమిపూజ నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ అమలు చేస్తున్న పథకాలలో భాగంగా రూ.10 లక్షల వ్యయంతో ఈ భవనం నిర్మించనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి సహకారంతో గ్రామ మహిళా సంఘాల సభ్యుల కోసం ప్రత్యేక భవనం నిర్మాణం చేపడుతున్నట్లు పేర్కొన్నారు. మహిళలు ఒకేచోట సమావేశమై తమ సమస్యలు చర్చించుకునేందుకు ఈ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు, పాత రుణాలపై వడ్డీ మాఫీ, ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పిస్తోందని నాయకులు వివరించారు. మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ, అధికారులు, ఉపసర్పంచ్, వార్డు సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News