Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:56 PM

ముత్తంగి కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు 100% ఫలితాలు

01-05-2026 547 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన పదో తరగతి ఫలితాల్లో ముత్తంగి గ్రామానికి చెందిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి 100 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఈ ఏడాది పరీక్షలకు హాజరైన మొత్తం 97 మంది విద్యార్థులు అందరూ ఉత్తీర్ణులవగా, అందులో 60 మంది 500కు పైగా మార్కులు సాధించి పాఠశాల ప్రతిష్ఠను మరింత పెంచారు. పాఠశాల టాపర్‌గా లక్ష్మీ కీర్తన 584 మార్కులు సాధించగా, శృతి 578, శ్రీజ మరియు నివృత తలో 573, హరిత 571, వైష్ణవి 570 మార్కులతో ప్రతిభ చాటారు. అలాగే సంజన, కీర్తిక, హైందవీరెడ్డి, రాధాదేవి, భార్గవి, అమూల్య, తిని, వేదశ్రీ తదితర విద్యార్థులు కూడా మెరుగైన మార్కులు సాధించారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ సంగాని రాజు, ప్రిన్సిపల్ చంద్రిమ్ రాజేష్ విజేత విద్యార్థులను సత్కరించి అభినందించారు. పాఠశాలలో నాణ్యమైన విద్య, క్రమశిక్షణ, ఉపాధ్యాయుల నిరంతర పర్యవేక్షణ వల్లే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయని ప్రిన్సిపల్ తెలిపారు. విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలు సాధించాలని చైర్మన్ ఆకాంక్షించారు. విద్యార్థుల విజయంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

Sthanikam

ముత్తంగి కృష్ణవేణి టాలెంట్ స్కూల్‌కు 100% ఫలితాలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News