Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రత్యామ్నాయ పంటల వివరాల కొరకు ప్రత్యేక హెల్ప్ లైన్ ఏర్పాటు ఓటర్ల వివరాల సేకరణ ఫారాలను వెంటనే అందజేయాలి:- ఆర్డీవో సువర్ణ లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 12, 2026 04:37 AM

ముస్తాబైన శివాలయాలు

ముస్తాబైన శివాలయాలు

ముస్తాబైన శివాలయాలు
February 15, 2026 02:29 AM 149 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని పట్టణంలోని శివాలయాలు శోభాయమానంగా ముస్తాబయ్యాయి. ముఖ్యంగా పిల్లలమర్రి శివాలయం సహా అన్ని శివాలయాల్లో ప్రత్యేక అలంకరణలు చేసి, భక్తుల రాకపోకలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టారు.

ఆదివారం జరిగే మహాశివరాత్రి సందర్భంగా దేవాలయాలను విద్యుద్దీపాలతో అలంకరించి ఆధ్యాత్మిక వాతావరణం నెలకొల్పారు. ఉదయం నుంచే అభిషేకాలు, ప్రత్యేక పూజలు, జపాలు, రాత్రి జాగరణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆలయ కమిటీలు సన్నాహాలు పూర్తి చేశాయి.భక్తులకు తాగునీరు, ప్రసాదం, కూర్చోవడానికి వసతి వంటి అన్ని సౌకర్యాలు కల్పించారు. భక్తుల రద్దీ దృష్ట్యా భద్రతా చర్యలు కూడా చేపట్టినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు.ఇటీవల జరిగిన ఎన్నికల కార్యక్రమాలతో అధికారులు, ప్రజాప్రతినిధులు బిజీగా ఉండటంతో ఈసారి పండుగకు పెద్దగా ప్రచారం జరగకపోయినా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని అంచనా వేస్తున్నారు.శివుని దర్శనార్థం రానున్న భక్తులతో ఆదివారం పట్టణం ఆధ్యాత్మిక కాంతితో కళకళలాడనుంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News