Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాంనగర్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా అమ్మవారి కుంకుమార్చన ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 05:35 AM

ముస్లింవాద సాహిత్య వికాసంపై విస్తృతోపన్యాసం సామరస్యానికి సాహిత్యం వంతెన: స్కైబాబ

24-03-2026 50 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నాగార్జున ప్రభుత్వ కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో “తెలుగులో ముస్లింవాద సాహిత్యం–వికాసం” అంశంపై విస్తృతోపన్యాసం నిర్వహించారు.

ఈ సందర్భంగా ప్రముఖ కవి, కథకుడు స్కైబాబ మాట్లాడుతూ మనది లౌకిక రాజ్యం కాబట్టి హిందూ–ముస్లింలు సఖ్యతతో జీవించాలని సూచించారు. ఖాదర్ మోహియొద్దీన్ రాసిన “పుట్టుమచ్చ” కావ్యంతో తెలుగులో ముస్లింవాద సాహిత్యం ఆరంభమైందని పేర్కొన్నారు. “నేను పుట్టక ముందే నా పేరు దేశద్రోహుల జాబితాలో చేరింది” వంటి భావ వ్యక్తీకరణలు ఆలోచింపజేస్తాయని అన్నారు.

1997లో విరసం “జీహాద్” పేరుతో ముస్లిం కవిత్వాన్ని సంకలనంగా తీసుకువచ్చిందని, ఆస్తిత్వ ఉద్యమాలు సమాజ ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేశాయని వివరించారు. తన సంపాదకత్వంలో వచ్చిన జల్‌జలా, వతన్, అలావా వంటి గ్రంథాల ప్రాధాన్యాన్ని వివరించారు. అనంతరం అఫ్సర్, యాకుబ్, షాజహానా, ఖాజా, మహేజబీన్, వలీ తదితరులు ముస్లిం సాహిత్యాన్ని బలోపేతం చేశారని తెలిపారు.

తాను రచించిన చెల్లెలేనోడు, వెజిటేరియన్స్ ఓన్లీ కథల గురించి ఆసక్తికరంగా వివరించారు. స్త్రీవాద సాహిత్యం పురుషులకు సున్నితత్వం నేర్పితే, ముస్లింవాద సాహిత్యం పరమత సహనాన్ని పెంపొందిస్తుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, తెలుగు విభాగం అధ్యక్షులు డా. వెల్దండి శ్రీధర్, అధ్యాపకులు డా. టి. సైదులు, డా. వాస భూపాల్, ప్రభాకర్, లింగస్వామి, శ్రవణ్ కుమార్, వనజ, హిందీ అధ్యాపకులు నాజియా, ఉర్దూ అధ్యాపకులు నస్రీన్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ముస్లింవాద సాహిత్య వికాసంపై విస్తృతోపన్యాసం సామరస్యానికి సాహిత్యం వంతెన: స్కైబాబ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News