Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 11:37 AM

మురుగునీటి సమస్య పరిష్కారానికి గ్రామ సర్పంచ్ చర్యలు

02-02-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Nyalakal Mandal, Sangareddy District
Reporter Sangameshwar Reddy

న్యాల్కల్

మురుగునీటి ప్రవాహంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుల సమస్యలను పరిష్కరించేందుకు గ్రామ సర్పంచ్ ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం హద్నూర్ గ్రామంలోని అల్లాదుర్గ్ మెటల్ కుంట రోడ్డు మార్గం సమీప కాలనీ నుంచి మురుగునీరు పొలాల దారి గుండా ప్రవహిస్తూ రైతులకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది.

ఈ మురుగునీటి కారణంగా పొలాలకు వెళ్లే రైతుల రాకపోకలు కష్టతరంగా మారాయి. పొలాల్లో సాగు చేసిన దాన్యరాశులు, చెరుకును వాహనాల్లో క్రషింగ్‌కు తరలించేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రాత్రి సమయాల్లో పొలాలకు వెళ్లాలంటే ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతున్నాయని రైతులు వాపోయారు.

ఈ విషయాన్ని రైతులు గ్రామ సర్పంచ్ ముత్తం శెట్టి ప్రవీణ్ దృష్టికి తీసుకెళ్లారు. సమస్యను పరిశీలించిన సర్పంచ్ జేసీబీ సహాయంతో మురుగునీటి కాల్వను తవ్వించి దారి మళ్లించారు. దీంతో పొలాల దారిలో మురుగునీటి సమస్య తొలగి రైతులు హర్షం వ్యక్తం చేశారు.

జహీరాబాద్ నియోజకవర్గం / హద్నూర్ గ్రామం, న్యాల్కల్ మండలం

Sthanikam

మురుగునీటి సమస్య పరిష్కారానికి గ్రామ సర్పంచ్ చర్యలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News