Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 04:19 PM

మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
January 09, 2026 08:22 PM 143 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy


చిట్యాల స్థానికరం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి


* పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం డైరీ చైర్మన్ అమిత్ రెడ్డి.


చిట్యాలలో వచ్చే మున్సిపల్ ఎన్నికలలో అభివృద్ధికి తోడ్పడే వ్యక్తులకు గెలిపించుకొని చిట్యాల అభివృద్ధికి తోడ్పడాలని పట్టణ ప్రజలకు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తెలంగాణ డైరీ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డిలు అన్నారు చిట్యాల మున్సిపాలిటీ పరిధిలో మూడు కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు ఈ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఉన్న, కనకదుర్గ ఆలయంలో నందు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం పట్టణ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం మాట్లాడుతూ చిట్యాల లో ఉన్న అన్ని వార్డులలో డ్రైనేజీ, సిసి రోడ్ పనులకు శంకుస్థాపన చేసామని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్యాల మున్సిపాలిటికి 15 కోట్లు మంజూరు చేశారని అన్నారు చిట్యాలలో పట్టణంలో వచ్చే మున్సిపల్ ఎన్నికలలో 12 వార్డులు కాంగ్రెస్ పార్టీ కేవసం చేసుకోవాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గెలిచే అభ్యర్థులకు టికెట్ ఇచ్చి ప్రతి ఒక్కరిని కాపాడుకుంటాం అని చిట్యాల లో ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లలను కేటాయిస్తాం అని మున్సిపాలిటీ లో ప్రతి వార్డులో సమస్యలను గుర్తించి వాటినీ పరిష్కరిస్తాం అని అన్నారు.


* చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ


సంవత్సరాల పాలనలో జూబ్లీహిల్స్ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలో, కంటోన్మెంట్ ఎన్నికలో, సర్పంచ్ ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ గెలుపోందడం గెలిచిందన్నారు . గత ప్రభుత్వంలో పేదవారికి ఇండ్లు ఇవ్వలేదన్నారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం నేడు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు,సన్నబియ్యం, ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత కరెంటు వంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు అందిస్తున్నామని అన్నారు. ఎమ్మెల్యే వీరేశం చొరవతో నకిరేకల్ నియోజకవర్గ వ్యాప్తంగా 3500 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసిందని త్వరలోనే ప్రతి నిరుపేద కుటుంబానికి అందిస్తామన్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వంలో పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. డబుల్ బెడ్ ఇండ్లను ఏ ఒక్కరికి మంజూరు లేదని , ఇంటికొక ఉద్యోగం, దళితులకు మూడెకరాల భూమి వంటి హామీలను గత ప్రభుత్వాలు మర్చిపోయారని, గత పది సంవత్సరాలలో పరిపాలించిన గత ప్రభుత్వాలు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదనిఅన్నారు. సంవత్సరాలలో పాలను చూసి ప్రజలే తీర్పు ఇస్తారు అని అన్నారు.


* కాంగ్రెస్ పార్టీలో మాజీ సర్పంచ్, ఎంపీటీసీ తో సహా భారీ చేరికలు


రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి మాజీ సర్పంచ్ గుండెబోయిన శ్రీలక్ష్మి మాజీ ఎంపీటీసీ గుండెబోయిన సైదులు శుక్రవారం 100 మంది అనుచరులతో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశంల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ ఎమ్మెల్యేలు వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో పనిచేసేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని వారన్నారు ఈ కార్యక్రమంలో చిట్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకటరెడ్డి, చిట్యాల పట్టణ కాంగ్రెస్ ప్రముఖులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు..

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News