నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి :నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణంలో వివిధ మున్సిపల్ వార్డులలో నూతన సీసీ రోడ్లు మరియు డ్రైనేజీ కాలువల నిర్మాణాలకు శంకుస్థాపన కార్యక్రమాలు నిర్వహించారు. అలాగే ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్న నారాయణఖేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పదేళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో మున్సిపల్ పట్టణంలో చిన్న చిన్న సమస్యలను కూడా పరిష్కరించడంలో విఫలమయ్యారని విమర్శించారు.అప్పటి నాయకులు పట్టణంలోని ప్రధాన కాలనీలలో అవసరమైన చోట్ల రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించకుండా కాలయాపన చేశారని పేర్కొన్నారు. అయితే తమ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి మున్సిపల్ పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు.నీటి సరఫరా నుంచి మౌలిక వసతుల వరకు అన్ని రంగాల్లో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని, భవిష్యత్తులో కూడా నారాయణఖేడ్ మున్సిపల్ పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టేలా కృషి చేస్తామని అన్నారు. పట్టణంలోని అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు అందజేస్తామని హామీ ఇచ్చారు.రానున్న మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు భారీ మెజార్టీ అందించి, పట్టణ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ప్రజల మద్దతుతో నారాయణఖేడ్ పట్టణాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, హౌసింగ్ అధికారులు, మున్సిపల్ కౌన్సిలర్లు, పట్టణానికి చెందిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
మున్సిపల్ పట్టణంలో అభివృద్ధి పనులకు శ్రీకారం:ఖేఢ్ ఎమ్మెల్యే డాక్టర్ పి సంజీవ్ రెడ్డి

Krishna

పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి