Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

మునిసిపల్ ఎన్నికల వార్ రూమ్ చైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డి

28-01-2026 81 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికo ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

మునిసిపల్ ఎన్నికల నేపథ్యంలో టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల వ్యూహాల రూపకల్పన, సమన్వయ బాధ్యతలను మరింత పటిష్టం చేయాలనే లక్ష్యంతో మునిసిపల్ ఎన్నికల వార్ రూమ్ ఛైర్మెన్‌గా గుత్తా అమిత్ రెడ్డిని నియమిస్తూ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధికారిక ఆదేశాలు జారీ చేశారు.

పార్టీలో సంస్థాగత అనుభవం, ఎన్నికల నిర్వహణలో వ్యూహాత్మక దృష్టి ఉన్న నాయకుడిగా పేరుగాంచిన గుత్తా అమిత్ రెడ్డికి ఈ కీలక బాధ్యతలు అప్పగించడం ద్వారా రాబోయే మునిసిపల్ ఎన్నికల్లో పార్టీకి స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వాలన్నదే టీపీసీసీ ఉద్దేశంగా కనిపిస్తోంది. వార్ రూమ్ ద్వారా అభ్యర్థుల ఎంపిక నుంచి ప్రచార వ్యూహాల వరకు అన్ని అంశాలను సమన్వయం చేస్తూ పార్టీని విజయపథంలో నడిపించాల్సిన బాధ్యత అమిత్ రెడ్డిపై ఉండనుంది.

ఈ నియామకంపై పార్టీ శ్రేణుల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా మునిసిపల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్న కాంగ్రెస్, ఈ వార్ రూమ్ వ్యవస్థ ద్వారా ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు పకడ్బందీ ప్రణాళికలు అమలు చేయనుందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Sthanikam

మునిసిపల్ ఎన్నికల వార్ రూమ్ చైర్మన్ గా గుత్తా అమిత్ రెడ్డి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News