Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
వెంకటాపురం పాఠశాల విద్యార్థులకు షూలు, సాక్స్‌ల పంపిణీ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 12:02 PM

మున్సిపల్ పోరుకు సిద్ధం – సీపీఐ

మున్సిపల్ పోరుకు సిద్ధం – సీపీఐ

మున్సిపల్ పోరుకు సిద్ధం – సీపీఐ
23-01-2026 66 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో పోటీ

చిట్యాల స్థానికం ప్రతినిధి ప్రశాంత్:

చిట్యాల పట్టణంలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వార్డుల్లో పోటీ చేసేందుకు సీపీఐ సిద్ధంగా ఉందని ఆ పార్టీ జిల్లా సహాయ కార్యదర్శి కామ్రేడ్ లోడంగి శ్రవణ్ కుమార్ తెలిపారు.శనివారం చిట్యాలలోని కామ్రేడ్ ఎండి అక్బర్ నివాసంలో నిర్వహించిన సీపీఐ చిట్యాల పట్టణ శాఖ కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఈ సమావేశం పట్టణ కార్యదర్శి ఎస్‌కే షరీఫ్ అధ్యక్షతన జరిగింది.

ఈ సందర్భంగా లోడంగి శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. పేదల పక్షాన నిలబడి, వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటాలు చేస్తున్న సీపీఐ అభ్యర్థులను మున్సిపల్ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు తమ అమూల్యమైన ఓటుతో గెలిపించాలని కోరారు. ప్రజాస్వామ్య విలువలు, పారదర్శక పాలన కోసం సీపీఐ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.ఈ సమావేశంలో సీపీఐ మండల కార్యదర్శి ఎండి అక్బర్, జిల్లా సహాయ కార్యదర్శి జిల్లా సత్యం, చిట్యాల పట్టణ కార్యదర్శి ఎస్‌కే షరీఫ్‌తో పాటు నాయకులు బొలుగూరి లింగయ్య, దేశగాని బాలరాజు, రామలింగయ్య, రావుల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ పోరుకు సిద్ధం – సీపీఐ

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News