Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:38 AM

మున్సిపల్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్

20-03-2026 56 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పారిశుద్ధ్యం, పన్ను వసూళ్లపై కట్టుదిట్టమైన చర్యలు

మున్సిపాలిటీ పరిధిలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు మున్సిపల్ కమిషనర్లకు సూచించారు.

శుక్రవారం తన ఛాంబర్‌లో మున్సిపల్ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆరు మున్సిపాలిటీలలో అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా పారిశుద్ధ్యం, వ్యర్థాల నిర్వహణ, ఆస్తి పన్ను, దుకాణాల అద్దె వసూలు, జనన–మరణ నమోదు, వేసవిలో తాగునీటి సరఫరా, మురుగు కాలువల శుభ్రత, వీధి కుక్కల నియంత్రణ, పార్కుల పచ్చదనం, వీధి దీపాల నిర్వహణ, మార్కెట్ పనుల పురోగతిపై సమగ్రంగా సమీక్షించారు.

పారిశుద్ధ్యంపై ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ప్రతి వీధి శుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. చెత్త సేకరణ, పారవేతలో సమర్థవంతమైన విధానాలు అమలు చేయాలని సూచించారు. ఇంటి పన్ను వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టి, 100 శాతం వసూళ్లు సాధించాలని, నిర్దిష్ట గడువులో లక్ష్యాలను పూర్తి చేయాలని కమిషనర్లకు సూచించారు.

మున్సిపల్ సేవలను మరింత మెరుగుపరుస్తూ ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి మున్సిపాలిటీల సమగ్ర అభివృద్ధికి కృషి చేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తెలిపారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి: అదనపు కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News