Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 21, 2026 11:59 PM

మున్సిపల్ కోఆప్షన్ సభ్యులను అభినందించిన కౌన్సిలర్ మమత రాజు

02-05-2026 457 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సదాశివపేట మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు మునిపల్లి సత్యనారాయణ, ఎగమామిడి అనంతమ్మ, మహమ్మద్ రహమత్, సీమా సుల్తానలను 12వ వార్డు కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారికి శాలువాలు కప్పి, పూలమాలలు వేసి, పుష్పగుచ్ఛాలు అందజేసి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. ప్రజాసేవలో నిబద్ధతతో పనిచేస్తూ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని, పట్టణ అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారం, సంక్షేమ పథకాల అమలులో అందరూ సమిష్టిగా పని చేయాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు, ఉన్నత పదవులు తప్పక లభిస్తాయని, నాయకులు కార్యకర్తలు నిరుత్సాహపడకుండా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని మమత రాజు అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీజీఐఐసీ చైర్మన్ తూర్పు నిర్మలా జగ్గారెడ్డి ఎన్నికైన సభ్యులకు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి అభినందనలు తెలిపారు. కోఆప్షన్ సభ్యులు తమపై నమ్మకం ఉంచిన నాయకులకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ సేవ చేస్తామని హామీ ఇచ్చారు. మున్సిపల్ కమిషనర్ టి. శివాజీ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మునిపల్లి అంజమ్మ, వైస్ చైర్మన్ రేణుక చిరంజీవి, వార్డు కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ కోఆప్షన్ సభ్యులను అభినందించిన కౌన్సిలర్ మమత రాజు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News