Sthanikam - Truth Matters
Logo

మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి:  ఎం‌డి సలీం సి‌ఐ‌టి‌యూ కార్యదర్శి

Updated : 24 Mar 2026 21:22 IST
As Preferred Source 1 min read
మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి:  ఎం‌డి సలీం సి‌ఐ‌టి‌యూ కార్యదర్శి

మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి: ఎం‌డి సలీం సి‌ఐ‌టి‌యూ కార్యదర్శి

మున్సిపల్ కాట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేసి ఆలోపు కనీస వేతనం 26,000 అమలు చేయాలని సిఐటియు జిల్లా కార్యదర్శి ఎండి సలీం పిలుపునిచ్చారు

       మంగళవారం చలో హైదరాబాద్ వెళ్తున్న మున్సిపల్ కార్మికుల వాహనాల జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ గత 30 సంవత్సరాలుగా పారిశుధ్య పనులు నిర్వహిస్తూ పట్టణాలు పరిశుభ్రంగా చేస్తూ అవార్డులు రావడానికి కృషి చేస్తున్న కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపకుండా చాలీచాలని వేతనాలు ఇస్తూ వెట్టిచాకిరి చేయించు కుంటున్నారని ఆరోపించారు. జనాభాకు అనుగుణంగా కార్మికుల సంఖ్య లేకపోవడం వలన అదనపు భారాలు పడుతూ అవస్థలు పడుతున్న కార్మికులకు కనీసం పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కూడా నేటికీ అనేక మునిసిపాలిటీలలో అమలు జరగడం లేదని అన్నారు. కొన్ని మున్సిపాలిటీలలో మూడు నాలుగు నెలల వేతనాలు పెండింగ్లో ఉంటున్నాయని జీతాలు లేకుండా పని ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వం వెంటనే మున్సిపల్ కార్మికులను పర్మినెంట్ చేయాలని, ఆలోపు కనీస వేతనం 26,000 పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని, అర్హత కలిగిన మున్సిపల్ కార్మికులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని, రేషన్ కార్డులు, పెన్షన్లు తదితర సంక్షేమ పథకాలు వర్తింప చేసే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు

         ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు దండెంపల్లి సత్తయ్య, జిల్లా సహాయ కార్యదర్శి అవుట రవీందర్, జిల్లా కమిటీ సభ్యులు సిహెచ్ అనురాధ, యూనియన్ జిల్లా అధ్యక్షులు చింతకాయల సంతోష్, పట్టణ కార్యదర్శి పెరిక కృష్ణ , వర్కింగ్ ప్రెసిడెంట్ పేర్ల సంజీవ, పందుల లింగయ్య చిక్కుళ్ళ రాములు కాటపల్లి శ్రావణ్ కుమార్ ,జీడిమెట్ల నరసింహ, నక్క సత్తయ్య, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలి:  ఎం‌డి సలీం సి‌ఐ‌టి‌యూ కార్యదర్శి

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news