Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి: ఘనంగా నివాళులర్పించిన ఈఎల్వి భాస్కర్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 03:43 AM

మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

28-01-2026 52 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

జోనల్ అధికారుల పాత్ర కీలకం

జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

స్థానికం ప్రతినిధి

జిల్లాలో మున్సిపల్ ఎన్నికలను పారదర్శకంగా, శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జోనల్ అధికారులు కీలక పాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అన్నారు.సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో మున్సిపల్ ఎన్నికల సందర్భంగా బుధవారం ఏర్పాటు చేసిన జోనల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ టీములు, వీడియో సర్వైలెన్స్ టీములు, వ్యయ పరిశీలకుల శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు.ప్రతి జోన్ పరిధిలో ఎన్నికల నిర్వహణకు సంబంధించిన అన్ని ఏర్పాట్లపై జోనల్ అధికారులు నేరుగా పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల స్థితిగతులు, సిబ్బందినియామకం, ఓటర్లకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఖచ్చితంగా అమలు చేయాలని, ఎలాంటి ఉల్లంఘనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సమస్యాత్మక ప్రాంతాల్లో ముందుగానే చర్యలు తీసుకుని శాంతిభద్రతలను కాపాడాల్సిన బాధ్యత జోనల్ అధికారులపై ఉందన్నారు. పోలింగ్ రోజున ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా చూడాలని, ఫిర్యాదులకు తక్షణ స్పందన ఇవ్వాలని ఆదేశించారు.ఎన్నికల సమయంలో అభ్యర్థులు ఖర్చు పరిమితిని తప్పనిసరిగా పాటించేలా పర్యవేక్షించడం వ్యయ పరిశీలకుల ప్రధాన బాధ్యత అని తెలిపారు. డబ్బు, బహుమతులు, మద్యం వంటి వాటి అక్రమ పంపిణీని అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్ టీములతో సమన్వయం చేసుకుని చర్యలు తీసుకోవాలని సూచించారు. అనుమానాస్పద లావాదేవీలపై నిఘా ఉంచి, అవసరమైతే తక్షణ చర్యలు చేపట్టాలని తెలిపారు. చెక్‌పోస్టుల వద్ద నిరంతర తనిఖీలు నిర్వహించాలని, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు క్షేత్రస్థాయిలో చురుకుగా పనిచేసి ఫిర్యాదులపై వెంటనే నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.అదనపు కలెక్టర్ కే సీతారామారావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలని, పెళ్లిళ్లకు సంబంధించిన వారు, ఆస్పత్రులకు వెళ్లే వారి విషయంలో సానుకూలంగా వ్యవహరించాలని సూచించారు. నగదు, మద్యం పట్టుబడిన సందర్భాల్లోతప్పనిసరిగా వీడియోగ్రఫీ ద్వారా చిత్రీకరణ చేయాలని తెలిపారు.ఈ శిక్షణ కార్యక్రమంలో ట్రైనింగ్ నోడల్ అధికారి శ్రీధర్ రెడ్డి, వ్యయ పరిశీలకుల నోడల్ అధికారి ప్రవీణ్ కుమార్, మాస్టర్ ట్రైనర్ రమేష్, జోనల్ అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, వ్యయ పరిశీలకులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News