Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాల్యవివాహాలు చట్టరీత్యా నేరం: సర్పంచ్ శాపాక లింగస్వామి కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 07:43 PM

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి

మున్సిపల్ ఎన్నికలకు సిద్ధం కావాలి
January 28, 2026 02:14 PM 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ప్రజాపక్షమే తెలంగాణ రాజ్యాధికార పార్టీ

స్థానికం ప్రతినిధి

సూర్యాపేటలోని తెలంగాణ రాజ్యాధికార పార్టీ జిల్లా కార్యాలయంలో మున్సిపల్ ఎన్నికల ప్రకటన విడుదల సందర్భంగా వార్తా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ నేతృత్వం వహించారు.ఈ సందర్భంగా వట్టె జానయ్య యాదవ్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ప్రకటన వెలువడిన నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఎన్నికలకు సన్నద్ధం కావాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ వంటి అగ్రకులాల పార్టీలు బడుగు, బలహీన వర్గాలను పదే పదే మోసం చేస్తూ వచ్చాయని తీవ్ర విమర్శలు చేశారు.సూర్యాపేట మున్సిపాలిటీలో చైర్మన్ పదవిపై అన్ని వర్గాలకు ఆశ చూపి చివరికి అన్యాయం చేయడం ప్రజలు ఎన్నోసార్లు చూశారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల అభివృద్ధి కోసం ఈ పార్టీలు ప్రభుత్వాల్లో ఉన్నప్పటికీ ఏమీ చేయలేదని, మాటలతోనే మోసం చేస్తున్నాయని ఆరోపించారు.

ఈసారి సూర్యాపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో తెలంగాణ రాజ్యాధికార పార్టీకి చెందిన కత్తెర గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. సాధారణ స్థానమైన సూర్యాపేట మున్సిపాలిటీలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పరస్పరం కుమ్మక్కై డమ్మీ అభ్యర్థులను నిలబెట్టి స్థానాన్ని కైవసం చేసుకునేందుకు కుట్రలు చేస్తున్నాయని ఆరోపించారు. “ఈ రెడ్డి కాకపోతే ఆ రెడ్డి” అన్న విధంగా రాజకీయాలు చేస్తూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఆవిర్భవించిన తరువాత పలు కుయుక్తులకు పాల్పడుతున్నారని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాల హక్కుల కోసం, నిజమైన ప్రజాపాలన కోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీయే సరైన ప్రత్యామ్నాయమని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో పార్టీ మహిళా కార్యనిర్వాహక అధ్యక్షురాలు నీరజ గౌడ్, సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, ప్రధాన కార్యదర్శి మీర్ అక్బర్, మహిళా అధ్యక్షురాలు కొన్నె మంజుల, కార్యదర్శి నారాయణదాసు కవిత, మహిళా ఉపాధ్యక్షురాలు కవిత, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, కార్యదర్శి ఏశబోయిన మల్లేష్, సూర్యాపేట మండల అధ్యక్షుడు లింగస్వామి, పెన్పహాడ్ మండల అధ్యక్షుడు ఆవుల అంజయ్య, ఆత్మకూరు మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, మాజీ మార్కెట్ డైరెక్టర్ మురళి, రంగన్న, కుంభం వెంకన్న, దేశబోయిన సురేష్, నాలుగో వార్డు పార్టీ సభ్యులు మొండే గోపి, నెలచర్ల మధు ప్రజాపతి, మామిడి ఉపేందర్, కడి

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News