Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:55 PM

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బిజెపి గడపగడప ప్రచారం

18-01-2026 126 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి

చిట్యాల మునిసిపాలిటీ పరిధిలో రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ నాయకులు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా బీజేపీ నాయకులు ఈడుదల మల్లేష్ ఆధ్వర్యంలో 5వ వార్డులో గడప గడపకు వెళ్లి ఓటర్లను కలిసి, బీజేపీ కమలం పువ్వు గుర్తుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ సందర్భంగా బీజేపీ చిట్యాల పట్టణ అధ్యక్షులు గుండాల నరేష్ గౌడ్ మాట్లాడుతూ, గత 11 ఏళ్లుగా రాష్ట్రంలో బీఆర్‌ఎస్ పాలన, ప్రస్తుతం కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ప్రజలు మోసపోతూనే ఉన్నారని విమర్శించారు. ముఖ్యంగా మున్సిపాలిటీల అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తున్న ‘అమృత్’, ‘స్వచ్ఛ భారత్’ వంటి పథకాల నిధులను రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా వినియోగించకుండా దారి మళ్లిస్తోందని ఆరోపించారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలతో రాష్ట్రాభివృద్ధికి సహకరిస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.

మునిసిపల్ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో, బీజేపీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి విజయం సాధించాలని పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో పరిమిత స్థానాల్లో పోటీ చేసినప్పటికీ బీజేపీ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ, అదే ఉత్సాహంతో మునిసిపల్ ఎన్నికల్లోనూ పార్టీ విజయానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి మాస శ్రీనివాస్, బీజేవైఎం రాష్ట్ర నాయకులు కబాలపల్లి సతీష్, సీనియర్ నాయకులు పల్లె వెంకన్న గౌడ్, జిల్లా కౌన్సిల్ సభ్యులు కూరెళ్ల శ్రీనివాస్, జిల్లా నాయకులు జయరాపు రామకృష్ణ, నీలం మధు, నీలం నరేష్, పాల రవి వర్మ, బెల్లి నరేష్, కన్నె బోయన మురళితో పాటు పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో బిజెపి గడపగడప ప్రచారం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News