Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ప్రచార వాహనం ప్రారంభం ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 16, 2026 04:36 AM

మునగ సాగుపై రైతులకు కలెక్టర్ సూచనలు

మునగ సాగుపై రైతులకు కలెక్టర్ సూచనలు

మునగ సాగుపై రైతులకు కలెక్టర్ సూచనలు
18-03-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి జిల్లాలో వ్యవసాయ రంగంపై వచ్చిన వార్తల ప్రభావంతో రైతులకు ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన పెంచేందుకు అధికారులు చర్యలు ముమ్మరం చేశారు.

జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తుర్కపల్లి మండలం దత్తాయిపల్లి గ్రామంలో క్షేత్రస్థాయిలో పర్యటించి క్రాప్ బుకింగ్, డిజిటల్ పంట నమోదు, రైతు రిజిస్ట్రీ ప్రక్రియలను పరిశీలించారు.

ఈ సందర్భంగా సేంద్రీయ విధానంలో సాగు చేస్తున్న మునగ పంటను పరిశీలించిన కలెక్టర్, తక్కువ పెట్టుబడితో ఎక్కువ కాలం అధిక దిగుబడి ఇచ్చే పంటగా మునగను అభివర్ణించారు. మునగ ఆకుల్లో విటమిన్లు, కాల్షియం, ఐరన్, ప్రోటీన్లు సమృద్ధిగా ఉండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో కూడా డిమాండ్ ఉందని తెలిపారు.

ఈ తరహా యూనిట్లను జిల్లాలోని అన్ని మండలాల్లో ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైతులు వరి పంటకు బదులుగా వాణిజ్యపరమైన లాభాలు ఇచ్చే మునగ పంటను సేంద్రీయ పద్ధతిలో సాగు చేయాలని సూచించారు.

తదుపరి ఆయిల్ పామ్ నర్సరీలు, క్షేత్రాలను పరిశీలించి, నేషనల్ మిషన్ ఆన్ ఆయిల్ పామ్ పథకాన్ని వినియోగించుకోవాలని రైతులకు సూచించారు. అలాగే భువనగిరిలో డ్రిప్ ఇరిగేషన్ ద్వారా సాగు చేస్తున్న మామిడి తోటను పరిశీలించి ఆధునిక పద్ధతులు అవలంబించాలని అన్నారు.

ఈ పర్యటనలో జిల్లా వ్యవసాయ అధికారి పీ.వీ. రమణ రెడ్డి, ఉద్యాన అధికారి మాధవి, ఇతర అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Sthanikam

మునగ సాగుపై రైతులకు కలెక్టర్ సూచనలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News